Home » News » Karthika Deepam 2 March 14th 2026 Today Episode Saturday Highlights
News

Karthika Deepam 2 March 14th 2026 Today Episode : దీప సొంత కూతురు అని నోరుజారిన జ్యోత్స్న.. పుట్టింట్లో చనిపోయినట్టేనని కాంచన శపథం!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: March 14, 2026 8:36 am
Advertisement

Karthika Deepam 2 March 14th 2026 Today Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజురోజుకూ ఊహించని మలుపులతో, భావోద్వేగాలతో సీరియల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. జ్యోత్స్న పన్నిన కుట్రల వల్ల కార్తీక్, దీపల జీవితాల్లో ఎప్పటికప్పుడు కొత్త తుఫానులు రేగుతూనే ఉన్నాయి. ఇక ఈరోజు మార్చి 14న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీప బిడ్డను వదులుకోబోతున్న విషయం ఇంటిల్లిపాదికీ తెలియడం, ఈ విషయం ముందే తెలిసినా దశరథ దాచిపెట్టడంతో కాంచన తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. అసలు ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Advertisement

Karthika Deepam 2 March 14th 2026 Today Episode : దీప సొంత కూతురు అని నోరుజారిన జ్యోత్స్న.. పుట్టింట్లో చనిపోయినట్టేనని కాంచన శపథం!

Karthika Deepam 2 March 14th 2026 Today Episode కాంచన గుండెకోత.. పారిజాతం ఆజ్యం

దీప కడుపులో ఉన్న బిడ్డను వదులుకుంటోంది అన్న నిజం తన అన్నయ్య దశరథకు ముందే తెలుసన్న విషయం కాంచనకు తీవ్ర మనస్తాపాన్ని మిగులుస్తుంది. పారిజాతం కావాలనే ఈ నిజాన్ని అందరి ముందు బయటపెట్టి ఇంట్లో నిప్పులు పోస్తుంది. శివన్నారాయణ సైతం దశరథను నిలదీస్తాడు. “నీకు ఈ నిజం ఎప్పుడో తెలిస్తే ఇప్పటి వరకు ఎందుకు దాచావు?” అని ఫైర్ అవుతాడు. పారిజాతం కల్పించుకుని, “ఆరోజు వీళ్లు మాట్లాడుకుంటుంటే నేను పొడిపొడిగా విన్నాను. బిడ్డ వల్ల దీపకు ప్రాణాపాయం ఉందని కార్తీక్ చెప్పాడు” అని అంటుంది. దీంతో కాంచన మరింత కుంగిపోతుంది. “నీ కొడుకు, కోడలే కాదు.. మీ అన్నయ్య కూడా నిన్ను మతిలేని దాన్ని చేసి ఆడుకున్నాడు” అని పారిజాతం మరింత రెచ్చగొడుతుంది.

Advertisement

Karthika Deepam 2 March 14th 2026 Today Episode ఇక నన్ను ‘చెల్లెమ్మా’ అని పిలవద్దు: బంధం తెంచుకున్న కాంచన

చెల్లెలు బాధపడుతుండటం చూసి దశరథ “చెల్లెమ్మా.. నేను చెప్పేది విను” అని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. కానీ కాంచన సీరియస్ అవుతుంది. “పిన్ని చెప్పింది నిజమే.. ఇకపై నన్ను చెల్లెమ్మా అని పిలవద్దు అన్నయ్య. నా కొడుకు, కోడలు, పుట్టబోయే బిడ్డ గురించి నేను కమ్మటి కలలు కంటుంటే.. నువ్వు నా పక్కనే ఉండి అన్నీ భలే ఓపికగా నటించావు కదా” అని నిలదీస్తుంది. “నాకు తల్లి లేదు.. నాన్న ఎప్పుడూ వ్యాపారాలంటూ బిజీ. కష్టమైనా, సుఖమైనా నిన్నే నమ్ముకున్నాను. కానీ తోడబుట్టిన చెల్లిని కూడా నువ్వు మోసం చేశావు. నా కోడలి చేయి నీ చేతిలో పెట్టి బిడ్డ జాగ్రత్త అని అడిగినప్పుడు కూడా నీకు నిజం చెప్పాలనిపించలేదా?” అని కాంచన కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. దశరథ్ ఏదో చెప్పబోతుంటే కాంచన వినదు. అడ్డుపడబోయిన శివన్నారాయణను సైతం జ్యోత్స్న అడ్డుకుంటుంది. “డాడీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పనివ్వు అత్తా” అని జ్యోత్స్న కావాలనే అంటుంది. ఇదంతా జ్యోత్స్న ఆడిన నాటకం అని కార్తీక్, దశరథ్ లకు అర్థమవుతుంది.

పుట్టింట్లో అనాథలా చనిపోయినట్టే.. కుమిలిపోయిన శివన్నారాయణ

కాంచన ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. “నాకు ఇక ఏ నిజమూ తెలియాల్సిన అవసరం లేదు. ఒక మోసపోయిన ఆడదానిలా మీ మేనత్త ఈరోజు పుట్టింట్లో, ఈ నట్టింట్లో చచ్చిపోయినట్లే” అని కాంచన చేసిన శపథానికి కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. “విధిరాత నాకు కాళ్లు లేకుండా చేస్తే, మీరంతా కలిసి నాకు ప్రాణమే లేకుండా చేశారు. కూతురిగా, చెల్లిగా, భార్యగా, తల్లిగా, అత్తగా, ఒక మనిషిగా అన్ని రకాలుగా నేను మోసపోయాను. కార్తీక్.. నాకు ఇక్కడి నుంచి దూరంగా పారిపోవాలని ఉంది” అంటూ కాంచన వీల్ చైర్ లో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెంటే శ్రీధర్ కూడా వెళతాడు. తన కూతురి ఆవేదన చూసి శివన్నారాయణ సోఫాలో కుప్పకూలిపోతాడు. తను అనుకున్నది సాధించానని జ్యోత్స్న మనసులో సంబరపడుతుంది.

Advertisement

కాశీ, స్వప్నల మధ్య మళ్లీ చిగురిస్తున్న ప్రేమ

మరోవైపు స్వప్న, కాశీ పాత స్మృతులను నెమరువేసుకుంటారు. “నా చుట్టూ నాలుగు నెలలు తిరిగావు, నాతో ఐ లవ్ యూ చెప్పించడానికి వైజాగ్ లో సగం సముద్రం ఈదినంత పని చేశావు. కానీ ఇప్పుడు నన్ను నడి సముద్రంలో వదిలేశావు” అని స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తుంది. దానికి కాశీ బదులిస్తూ, “నడి సముద్రం వరకు వెళ్తేనే అన్ని తెలుస్తాయి. పెళ్లికి ముందు ఉన్న కష్టం, పెళ్లి తర్వాత లైఫ్ ఈజీ అయిపోయేసరికి దాని విలువ తెలియకుండా పోయింది” అంటాడు. స్వప్న సైతం “కలవడానికి మూడు ముళ్లు, విడిపోవడానికి రెండు సంతకాలు” అని ఫిలాసఫీ చెబుతుంది.

కానీ కాశీ ఆమెను లాజిక్ తో కొడతాడు. “మరి విడిపోవాలనే డిసైడ్ అయితే పాపిట్లో సింధూరం ఎందుకు చెరిపేసుకోలేదు? ఎందుకంటే నువ్వు నన్ను మనసులో నుంచి తీసేయలేవు” అంటాడు. “ఈరోజు మన పెళ్లిరోజు అని నాకు గుర్తుంది. మార్నింగ్ గుడికి వెళ్లి వచ్చాను” అని చెప్పి స్వప్న చేతిలో ఓ ఎర్ర గులాబీ పెడతాడు. స్వప్న తెలియకుండానే దాన్ని తీసుకుంటుంది. కానీ కాశీ వెళ్లగానే కింద పడేస్తుంది. ఇదంతా చూస్తుంటే వీళ్ల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లే కనిపిస్తోంది.

కార్తీక్, దీపల మీటింగ్.. జ్యోత్స్న నిఘా

ఇంట్లో జరిగిన అవమానాన్ని తలుచుకుని దీప కుమిలిపోతుంది. కార్తీక్ వచ్చి ఆమెను ఓదారుస్తాడు. “ఇక్కడ మనల్ని అన్న ప్రతి మాట వెనుక జ్యోత్స్న మాస్టర్ మైండ్ ఉంది. ఇదంతా తాతతో కలిసి జ్యోత్స్న పన్నిన వ్యూహం” అని దశరథకు వివరిస్తాడు కార్తీక్. “అమ్మ దృష్టిలో నేను మోసగాడిగా మిగిలిపోయాను” అని కార్తీక్ బాధపడతాడు. అప్పుడు దశరథ్ స్పందిస్తూ.. “నువ్వు ఇక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదు. వెంటనే దీపను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో” అని సలహా ఇస్తాడు. వీళ్లు ముగ్గురూ మాట్లాడుకుంటున్న విషయాన్ని జ్యోత్స్న చాటుగా గమనిస్తుంది. ఆమె చూడటాన్ని గమనించిన కార్తీక్, దశరథ్ సైలెంట్ అయిపోతారు.

‘దీప సొంత కూతురు కదా’.. నోరు జారిన జ్యోత్స్న

ఈ ఎపిసోడ్‌లో అతిపెద్ద హైలైట్ ఇదే. తన ప్లాన్ సక్సెస్ అయిందని జ్యోత్స్న పారిజాతం దగ్గర సంబరాలు చేసుకుంటుంది. “ఇంతమంది ఉంటే ఎంతకు తెగించి సమాధానం చెప్పిందే ఆ దీప. కానీ బాగా గుట్టు బయటపెట్టావు” అని జ్యోత్స్నను మెచ్చుకుంటుంది పారిజాతం. అప్పుడు పారిజాతం.. “కార్తీక్ కంటే మీ నాన్నే దీప గురించి ఎక్కువగా కంగారు పడుతున్నాడు ఏంటి?” అని అనుమానం వ్యక్తం చేస్తుంది. అప్పుడు జ్యోత్స్న అత్యుత్సాహంతో.. “ఎంతైనా సొంత కూతురు కదా.. ఆ మాత్రం చూసుకుంటాడులే” అని నోరు జారుతుంది. ఆ మాట వినగానే పారిజాతం షాక్ అయ్యి.. “ఏంటే.. ఏం అన్నావు?” అని గట్టిగా అడుగుతుంది. వెంటనే తేరుకున్న జ్యోత్స్న.. “అదే, ఎంతైనా సొంత కూతురిలా చూసుకుంటున్నాడు కదా అని అంటున్నాను” అని కవర్ చేస్తుంది. “ఆ ప్రేమ దీప మీద కాదు, దీప కడుపులో ఉన్న బిడ్డ మీద. దీపను ఇంటికి రానివ్వకుండా కాంచనను మరింత రెచ్చగొట్టాలి. అప్పుడు కార్తీక్ గాడు ఒంటరివాడై గిలగిల కొట్టుకుంటాడు. అప్పుడు నా అసలు ఆట మొదలవుతుంది” అని జ్యోత్స్న తన కుట్రను బయటపెడుతుంది. దీప మీద జ్యోత్స్నకు ఉన్నది కేవలం కోపం మాత్రమే కాదని, ఆమె మనసులో మరేదో పెద్ద ప్లాన్ నడుస్తోందని పారిజాతానికి అనుమానం వస్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement

రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతోంది?

జ్యోత్స్న నోరు జారిన మాట పారిజాతం మనసులో బలమైన అనుమానాన్ని రేకెత్తించింది. అసలు దీప, దశరథల మధ్య ఉన్న అసలు బంధం జ్యోత్స్నకు తెలిసిపోయిందా? కాంచన నిజంగానే కార్తీక్, దీపలను దూరం పెడుతుందా? ఈ పరిణామాల మధ్య కార్తీక్, దీపల ప్రయాణం ఎటు దారి తీయబోతోంది అనేది తదుపరి ఎపిసోడ్స్ లో అత్యంత ఆసక్తికరంగా మారనుంది. మరింత ఉత్కంఠభరితమైన కార్తీక దీపం 2 అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే!

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి