Home » News » Karthika Deepam 2 Today Episode 2026 Feb 9th Highlights
News

9 February 2026 Karthika Deepam 2 Today Episode : 9 ఫిబ్రవరి 2026 కార్తీక దీపం 2 ఎపిసోడ్: సుమిత్రకు మతిభ్రమించిందా? కన్నతల్లి కోసం దీప ప్రాణత్యాగం.. షాక్‌లో కార్తీక్..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 9, 2026 8:38 am
Advertisement

9 February 2026 Karthika Deepam 2 Today Episode : బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్ ‘కార్తీక దీపం 2 – ఇది నవ వసంతం’. ప్రతిరోజూ సరికొత్త మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ ఈరోజు (ఫిబ్రవరి 9, 2026) సోమవారం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా సుమిత్ర అనారోగ్యం, దీప తన తల్లిని కాపాడుకోవడానికి పడుతున్న తపన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి.

Advertisement

9 February 2026 Karthika Deepam 2 Today Episode : 9 ఫిబ్రవరి 2026 కార్తీక దీపం 2 ఎపిసోడ్: సుమిత్రకు మతిభ్రమించిందా? కన్నతల్లి కోసం దీప ప్రాణత్యాగం.. షాక్‌లో కార్తీక్..!

9 February 2026 Karthika Deepam 2 Today Episode :  ఎవరినీ గుర్తుపట్టని స్థితిలో సుమిత్ర

నేటి ఎపిసోడ్ ప్రారంభంలో, సుమిత్ర ఉదయాన్నే ఒంటరిగా గార్డెన్‌లో నడుస్తూ కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, దీపలు ఆమెను పలకరిస్తారు. “అమ్మా.. టిఫిన్ చేశారా?” అని దీప అడగ్గా, సుమిత్ర తిరిగి “మీరు ఎవరు? నన్నెందుకు పిలుస్తున్నారు?” అని అడుగుతుంది. ఈ మాట విన్న దీప, కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతలోనే దశరథ అక్కడికి వచ్చి సుమిత్ర చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుండగా.. “నువ్వు ఎవరు? నా చేయి ఎందుకు పట్టుకుంటున్నావ్?” అని అతనిపై కూడా విసుక్కుంటుంది.

Advertisement

దీంతో ఇంట్లో వారందరికీ సుమిత్ర మనుషులను గుర్తుపట్టలేకపోతోందని అర్థమవుతుంది. పారిజాతం ఇది చూసి, “నీ తల్లికి మతి పోయినట్టు ఉంది” అని జ్యోత్స్నతో అనడం మరింత కలకలం రేపుతుంది. శివన్నారాయణ తన కోడలి పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకుంటాడు.

9 February 2026 Karthika Deepam 2 Today Episode : కన్నీరు మున్నీరైన దశరథ

సుమిత్రకు మందులు వేసి పడుకోబెట్టిన తర్వాత, దశరథ కార్తీక్‌తో తన బాధను పంచుకుంటాడు. “డాక్టర్ చెప్పారు కార్తీక్.. ఈ వ్యాధి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని తెలిసినప్పటి నుంచి తను బాగా బెంగ పెట్టుకుంది. అందుకే ఇప్పుడు మనుషులను కూడా గుర్తుపట్టలేకపోతోంది” అని వెక్కి వెక్కి ఏడుస్తాడు.

Advertisement

అప్పుడే దీప తన తండ్రి బాధను చూడలేక “నాన్న” అని అరుస్తుంది. ఆ పిలుపు విని దశరథ ఎమోషనల్ అవుతూ.. “నా కన్నీళ్లు చూసి నీ నోట ఆ పిలుపు వచ్చిందా? కన్యాదానం చేసినందుకు నాన్న అని పిలిచావా? భార్యను కాపాడుకోలేని భర్తగా నేను బతకడం ఎందుకు?” అని అంటాడు. సుమిత్రమ్మకు ఏం కాదని దీప ధైర్యం చెప్పినా, దశరథ మాత్రం తన ఆశలను వదులుకున్నట్లు కనిపిస్తాడు.

హీరోయిక్ డెసిషన్ తీసుకున్న కార్తీక్

దశరథ బాధను చూసిన కార్తీక్, అతనికి అండగా నిలబడతాడు. “మామయ్య.. మగాడి జీవితంలో భార్య అనేది ఒక ప్రాణం. తను నీరసంగా ఉంటేనే భర్త శ్వాస భారంగా మారుతుంది. అలాంటిది తను శాశ్వతంగా దూరం అవుతుందంటే ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అత్తయ్య నీతోనే ఉంది, నీలోనే ఉంది. మనం ఎలాగైనా తనని కాపాడుకుందాం” అని భరోసా ఇస్తాడు.

హాస్పిటల్‌కు దీప.. డాక్టర్ హెచ్చరిక

మరోవైపు దీప ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్‌కు వెళ్తుంది. తన తల్లిని కాపాడుకోవడానికి సర్జరీ చేయమని డాక్టర్ హారికను వేడుకుంటుంది. అయితే, “దీప.. నీ తల్లిని కాపాడాలంటే నీ బిడ్డను త్యాగం చేయాలి. ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణం తీయడం ఏ పాపమో నీకు తెలుసా? నీ బిడ్డను చంపితే నువ్వు హంతకురాలివి అవుతావు” అని డాక్టర్ హెచ్చరిస్తుంది.

కానీ దీప మాత్రం, “నా తల్లి రుణం తీర్చుకోవడానికి నాకు ఇదే దారి. ప్లీజ్ డాక్టర్ ఆపరేషన్ చేయండి” అని బతిమిలాడుతుంది. కార్తీక్‌కు తెలిస్తే ఊరుకోడని డాక్టర్ చెప్పినా దీప వెనక్కి తగ్గదు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement

రేపటి ఎపిసోడ్‌లో దీప ఆపరేషన్‌కు సిద్ధమవుతుందా? కార్తీక్ సమయానికి వచ్చి దీపను ఆపుతాడా? జ్యోత్స్న, పారుల కుట్రలు ఎలా సాగుతాయి? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి