Home » News » Karthika Deepam 2 Today Episode August 25th
News

Karthika Deepam 2 Today Episode August 25th : సూరజ్-జ్యోత్స్నల పెళ్లిలో కొత్త ట్విస్ట్.. పారు మాస్టర్ ప్లాన్!

Karthika Deepam 2 Today Episode August 25th కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్‌లో పెళ్లి సందడి మధ్య ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు సూరజ్ వ్యవహారంపై కార్తీక్‌కు అనుమానం మొదలవుతుంది
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 25, 2026 11:08 am
Advertisement

Karthika Deepam 2 Today Episode August 25th: కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్‌లో పెళ్లి సందడి మధ్య ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు సూరజ్ వ్యవహారంపై కార్తీక్‌కు అనుమానం మొదలవుతుంది. ఇదే సమయంలో జ్యోత్స్నకు మొత్తం ఆస్తి దక్కేలా చేయాలని పారు వేసిన ప్లాన్ కొత్త ట్విస్ట్‌కు దారి తీసింది. దాస్ ఎంట్రీతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఆగస్టు 25న ప్రసారమైన 760వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఇంట్లో పెళ్లి బట్టల షాపింగ్ జోరుగా సాగుతుండటంతో అంతా సందడిగా కనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉండటాన్ని చూసిన జ్యోత్స్న మాత్రం భావోద్వేగానికి గురవుతుంది. పెళ్లి తర్వాత తనను మర్చిపోరు కదా అంటూ తల్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో దశరథ, సుమిత్రలు ఆమెను ఓదారుస్తారు.మరోవైపు కార్తీక్, దీపలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. ఈ సమయంలో జ్యోత్స్న అక్కడికి వచ్చి దీపకు క్షమాపణలు చెబుతుంది. ‘‘నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు ఒక చెల్లికి అక్కలా అండగా నిలిచావు. నా పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నావు. నువ్వు చాలా గొప్పదానివి’’ అంటూ దీప కాళ్లపై పడుతుంది. ఈ దృశ్యం చూసిన పారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక దీప కూడా భావోద్వేగానికి గురై.. ‘‘నువ్వు ఎప్పటికీ నా చెల్లెలివే’’ అంటూ జ్యోత్స్నను దగ్గరకు తీసుకుంటుంది.

Advertisement

Karthika Deepam 2 Today Episode August 25th : సూరజ్-జ్యోత్స్నల పెళ్లిలో కొత్త ట్విస్ట్.. పారు మాస్టర్ ప్లాన్!

Karthika Deepam 2 Today Episode August 25th సూరజ్‌ను చూసి కార్తీక్ షాక్.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

వెడ్డింగ్ కార్డులు ఇంటికి రావడంతో మొదటి శుభలేఖను తీసుకుని దక్షిణామూర్తి వద్దకు కార్తీక్, శివన్నారాయణ, దీప, జ్యోత్స్న వెళ్తారు. ‘‘మాట ఇచ్చినట్టుగానే మొదటి శుభలేఖను మీకే ఇస్తున్నాం. మీరు వస్తే మంచిది.. రాకపోతే మరీ మంచిది’’ అంటూ శివన్నారాయణ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తాడు.అనంతరం కార్తీక్, దీప ఇంటికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతారు. అయితే బైక్ తాళాలు మరిచిపోవడంతో కార్తీక్ వాటి కోసం పైకి వెళ్తాడు. అక్కడ దక్షిణామూర్తి ఇంట్లో సూరజ్ కనిపించడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సూరజ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా అక్కడ అతనికి బదులుగా మరో వ్యక్తి కనిపిస్తాడు. ఈ పరిణామాన్ని గమనించిన దక్షిణామూర్తి, మాలినిలకు చెమటలు పడతాయి.ఇదే సమయంలో గదిలో షర్ట్ ఐరన్ చేసుకుంటున్న సూరజ్ దగ్గరకు జ్యోత్స్న వస్తుంది. అతడిని పలకరిస్తుంది. ఈ సన్నివేశం గత ఎపిసోడ్‌లోనే ఆసక్తిని పెంచగా.. ఆగస్టు 25న ప్రసారమైన 760వ ఎపిసోడ్‌లో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది.రేపే తమ పెళ్లి అని చెప్పిన జ్యోత్స్న.. కొత్తగా భార్యాభర్తలుగా మారబోతున్న ఇద్దరికీ మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయని చెబుతుంది. దీనికి సూరజ్ స్పందిస్తూ.. ‘‘నాకైతే ఏం తెలియదు. అబ్బాయిల ఆలోచనల కంటే అమ్మాయిల ఆలోచనలు అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. అందుకే నీకు ఏం మాట్లాడాలో తెలుసు’’ అంటాడు.జ్యోత్స్న ఎంత చెప్పినా సూరజ్ పట్టించుకోకపోవడంతో అతడిని టచ్ చేసి ముద్దు పెట్టుకోబోతుంది. అయితే సూరజ్ వెంటనే పక్కకు తప్పుకుంటాడు. ‘‘ఇది కరెక్ట్ కాదు. ఇంకా నువ్వు నాకు భార్యవి కాలేదు. రేపటి వరకు టైం ఉంది’’ అని చెబుతాడు. దీంతో జ్యోత్స్న.. ‘‘ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఎదుటివాళ్లు ఇచ్చేది నువ్వు తీసుకోవు.. నువ్వు తీసుకోవాలనుకున్నదే తీసుకుంటావు’’ అంటూ సూరజ్‌ను పొగుడుతుంది.అయితే పెళ్లి తర్వాత కూడా ఇలాగే స్కూల్‌లో లెక్కల మాస్టర్‌లా ఉండొద్దని జ్యోత్స్న కోరుతుంది. తన కోసం మారాలని, అందరిలా మాట్లాడాలని, తాను జోక్ చేస్తే నవ్వాలని, ముద్దు ఇస్తే తీసుకోవాలని.. ముఖ్యంగా తనకు బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండాలని అడుగుతుంది.

Advertisement

దీనికి సూరజ్ తనదైన తత్వంతో సమాధానం ఇస్తాడు. ‘‘ఈ ప్రపంచంలో ముందుగా మనకి మనమే నచ్చాలి. మనకి మనమే నచ్చకపోతే ఎదుటివాళ్లకు ఎలా నచ్చుతాం?’’ అని ప్రశ్నిస్తాడు. దీంతో జ్యోత్స్న అతని మాటలను త్రికోణమితితో పోలుస్తుంది. ‘‘నీ మాటలు కూడా త్రికోణమితిలానే ఉంటాయి. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపిస్తాయి కానీ అర్థం కావు’’ అంటుంది.‘‘అయితే వదిలేయొచ్చు కదా’’ అని సూరజ్ అనగానే.. జ్యోత్స్న మాత్రం ‘‘నిన్ను వదిలేయడానికి నువ్వు నా చేతిలో వస్తువువా? నువ్వు నేను తీసుకునే ఊపిరివి. నీతో నేను కరిగిపోయి పూర్తిగా నేను మాయమయ్యే వరకు నిన్ను వదులుకోలేను’’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తుంది.ఇంతలో శ్రీధర్, కార్తీక్, దీప అక్కడికి రావడంతో సూరజ్, జ్యోత్స్న ఇద్దరూ షాక్ అవుతారు. సూరజ్‌ను తమ ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చామని శ్రీధర్ చెబుతాడు. ‘‘నువ్వు నా కొడుకువి.. నేను నీ తండ్రిని. రేపు ఉదయం మన ఇంటి దగ్గర మంగళస్నానాలు పూర్తి చేసుకుని మగపెళ్లి వాడి హోదాలో ఇక్కడికి వస్తాం’’ అని అంటాడు.అయితే సూరజ్ మాత్రం తాను వారి ఇంటికి రానని చెబుతాడు. ఇల్లు మారుతూ తిరగడం ఎందుకని, అందరూ ఇక్కడే ఉండిపోవచ్చని అంటాడు. ఆ ఇంటి దగ్గర చేయాల్సిన కార్యక్రమాలను ఇక్కడే చేసుకోవచ్చని సూచిస్తాడు.

దీనికి శ్రీధర్ స్పందిస్తూ.. మగపెళ్లి వారు, ఆడపెళ్లి వారు ఒకే చూరు కింద ఉండకూడదని, అలా ఉంటే పెళ్లి జరగదని పెద్దలు చెప్పారని గుర్తు చేస్తాడు. సూరజ్ మాత్రం తెలివిగా స్పందిస్తూ.. ‘‘ఒకే చూరు కింద ఎక్కడున్నాం? జ్యోత్స్న వాళ్లు పెద్ద ఇంట్లో, నేను ఈ చిన్న ఇంట్లో ఉంటున్నాను’’ అంటాడు.సూరజ్ ఎవరు చెప్పినా వినడని, తాను చెప్పిందే అందరూ వినాలని అనుకుంటాడని జ్యోత్స్న అంటుంది. దీనికి కార్తీక్ స్పందిస్తూ.. జ్యోత్స్న తన సూరజ్‌కు ఇష్టం లేని పని చేయొద్దని పరోక్షంగా చెబుతోందని అర్థం చేసుకుంటాడు.అందరూ వెళ్లిపోయిన తర్వాత కార్తీక్ సూరజ్‌ను ఆటపట్టిస్తాడు. ‘‘పెళ్లికి ముందే అడ్వాన్స్ అవుదామని అనుకుంటున్నావా?’’ అని అడగడంతో సూరజ్ కంగారుపడతాడు. తాను షర్ట్ ఐరన్ చేసుకుంటుండగా జ్యోత్స్న వచ్చిందని వివరణ ఇస్తాడు.‘‘మగాళ్ల వీక్ పాయింట్, ఆడాళ్ల స్ట్రాంగ్ పాయింట్ అదే’’ అంటూ పెళ్లాల్ని కంట్రోల్‌లో పెట్టాలని కార్తీక్ చెబుతుండగా దీప అక్కడికి రావడంతో ఒక్కసారిగా కంగారుపడతాడు.

Advertisement

Karthika Deepam 2 Today Episode August 25th జ్యోత్స్నకు మొత్తం ఆస్తి.. పారు మాస్టర్ ప్లాన్

తన వల్ల కార్తీక్, దీపలు ఇబ్బంది పడుతున్నారని భావించిన సూరజ్.. వారిద్దరికీ సారీ చెప్పాలని అనిపించిందని చెబుతాడు. వెంటనే కార్తీక్ ‘‘నువ్వు ఏమైనా తప్పు చేశావా?’’ అంటూ ప్రశ్నిస్తాడు.‘‘మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను’’ అని సూరజ్ చెప్పడంతో.. కార్తీక్ అతడికి ధైర్యం చెబుతాడు. ‘‘నీ పెళ్లి నా బాధ్యత. నువ్వు నాకు తమ్ముడి లాంటి వాడివి. రేపటి నుంచి తోడల్లుడివి. మనం మన కోసం మనమే చేసుకోవాలి.. బయటివాళ్లు రారు’’ అని అంటాడు.అయితే సూరజ్ ఎందుకు సారీ చెప్పాడనే అనుమానం కార్తీక్‌లో అలాగే ఉంటుంది. ‘‘నేను మాలిని ఇంట్లో చూశానని చెప్పబోతుండగా’’ దీప మధ్యలోనే కార్తీక్‌ను ఆపేస్తుంది.మరోవైపు ఉదయాన్నే దశరథ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటాడు. ఇదే సమయంలో పారు ఒక కీలక విషయాన్ని గుర్తు చేస్తుంది. ‘‘మీరిద్దరూ చేయాల్సిన పని మర్చిపోయారు. జ్యోత్స్నకు మొత్తం ఆస్తి రాస్తానని చెప్పారు కదా. జ్యోత్స్న పెళ్లి పీటలపైకి ఎక్కడానికి ముందే వీలునామాపై మీరు సంతకం పెడితే యావదాస్తి మొత్తం జ్యోత్స్నదే అవుతుంది’’ అని చెబుతుంది.

ఇంతలో దాస్ అక్కడికి వచ్చి.. ‘‘జ్యోత్స్న పేరు మీద యావదాస్తి రాయాలని నువ్వు అన్నయ్యకు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ పారు‌ను ప్రశ్నిస్తాడు. నువ్వు ఎందుకు వచ్చావని పారు అడగడంతో.. ‘‘కూతురి పెళ్లికి తండ్రి లేకపోతే ఎలా?’’ అని దశరథ అంటాడు.ఈ మాటలు విన్న పారు, సుమిత్రలు ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే దశరథ వెంటనే దాస్‌ను తన తమ్ముడిలాంటి వ్యక్తిగా పరిచయం చేస్తూ.. అంటే తన కూతురికి పినతండ్రి అని కవర్ చేస్తాడు.అయితే సుమిత్ర మాత్రం అసలు విషయాన్ని బయటపెట్టేలా మాట్లాడుతుంది. ‘‘నీ కూతురు పుట్టగానే చనిపోయింది. నీ బిడ్డ చనిపోకపోయి ఉంటే నీ కూతురు కూడా జ్యోత్స్న అంతే వయసులో ఉండేది’’ అని అంటుంది.

దీనికి దశరథ ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. దాస్ కూతురు జ్యోత్స్నేనని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. ‘‘నా కూతురి పెళ్లిని నీ కూతురి పెళ్లిగానే అనుకో’’ అంటూ దశరథ పరిస్థితిని కవర్ చేస్తాడు. దీంతో దాస్ కూడా మీరంతా కల్మషం లేని మనుషులంటూ మెచ్చుకుంటాడు.

అయితే దశరథకు జ్యోత్స్నే తన కూతురు అనే విషయం ముందే తెలుసా? అన్న అనుమానం పారు తన కొడుకును ప్రశ్నించే వరకు వెళ్లింది. దీంతో కుటుంబంలో మరో రహస్యం తెరపైకి వచ్చినట్లైంది.పెళ్లి వేడుకల నేపథ్యంలో సూరజ్, జ్యోత్స్నలను అందంగా ముస్తాబు చేస్తారు. జ్యోత్స్న అందంగా రెడీ అవ్వడంతో ఆమె ఫొటో తీసేందుకు శౌర్య వస్తుంది. ఫొటో తీసిన తర్వాత జ్యోత్స్న.. ‘‘మరి మీ బాబాయ్ ఫొటో తీశావా?’’ అని అడుగుతుంది.అయితే సూరజ్ తనకు బాబాయ్ కాదని, అంకుల్ అని జ్యోత్స్న చెప్పడంతో శౌర్య కూడా సరేనంటుంది. తన భర్త నీకు బాబాయ్ అని జ్యోత్స్న చెప్పడంతో శౌర్య ఒప్పుకుంటుంది. వెంటనే ‘‘వెళ్లి మీ బాబాయ్ ఫొటో తీయ్. పెళ్లికొడుకు గెటప్‌లో ఎలా ఉన్నాడో నేను చూస్తాను’’ అంటూ సూరజ్ దగ్గరకు పంపిస్తుంది.శౌర్య సూరజ్ దగ్గరకు వెళ్లి అతడి ఫొటో తీస్తుంది. అయితే పాప అటువైపు వెళ్లగానే సూరజ్ ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకుని దానిని చూసుకుంటూ మురిసిపోతాడు. ఆ గిఫ్ట్ బాక్స్‌లో ఏముంది? సూరజ్ ఎవరికి ఇవ్వబోతున్నాడు? అనే ఆసక్తిని పెంచుతూ కార్తీక దీపం 2 ఆగస్టు 25 ఎపిసోడ్ ముగిసింది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి