Home » News » Karthika Deepam 2 Today Episode May 26 2025
News

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 ఈ రోజు ఎపిసోడ్ : దీప ఎవ‌రి కూతురో నిజం చెప్పిన కార్తీక్‌.. షాక్‌లో దీప‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 26, 2025 9:14 am
Advertisement

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (మే 26)  karthika deepam 2 Today Episode ఎపిసోడ్‍లో కార్తీక్ కోసం karthika deepam 2 serial కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది. భోజనం చేయండని దీప అడుగుతుంది. నీకు ఆకలేస్తోందా అని కాంచన అంటుంది. భార్యవి నువ్వు అలా ఉంటే, తల్లిని నేనెంత తల్లడిల్లిపోవాలి అంటూ బాధపడతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. కార్తీక్ కాల్ చేశాడేమోనని కాంచన అంటుంది. మీ మేన కోడలు కాల్ చేస్తోందని దీప అంటే.. అవసరం లేదు ఎత్తవద్దు అని కాంచన అంటుంది. ఏఓ వీడియోలు పంపించిందని దీప చెబుతుంది.

Advertisement

karthika deepam 2 Today Episode: కార్తీక దీపం-2 ఈ రోజు ఎపిసోడ్ : దీప ఎవ‌రి కూతురో నిజం చెప్పిన కార్తీక్‌.. షాక్‌లో దీప‌

karthika deepam 2 Today Episode వీడియోలు చూసి తల్లిడిల్లిన దీప, కాంచన

కార్తీక్ తాత ఇంట్లో బూట్లను తుడ‌వ‌డం, భోజనం వడ్డించే వీడియోలను జ్యోత్స్న పంపిస్తుంది. ఆ వీడియోలను చూసి దీప, కాంచన ఇద్ద‌రూ తల్లిడిల్లిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇంతలో కార్తీక్ వచ్చేస్తాడు. ఎందుకు అందరూ అలా ఉన్నారని అడుగుతాడు. ఫ్రెండ్ వాళ్ల బాబు పుట్టిన రోజు అని కాల్ చేస్తే అటు వెళ్లాలని కార్తీక్ చెబుతాడు. పుట్టిన రోజుకు వెళ్లాఓ.. ఊడిగాలు చేసేందుకు వెళ్లాఓ మేం చూశాం రా అని కాంచన అంటుంది. మీరు ఆ ఇంట్లో ఏం చేశాఓ జ్యోత్స్న వీడియోలు పెట్టిందని చూపిస్తుంది దీప. మీరు సంతకం పెట్టారా మీ జీవితాన్ని తాకట్టు పెట్టారా అని అనసూయ అడుగుతుంది. జ్యోత్స్న నిన్ను బావ అనుకుంటుందా.. పని వాడు అనుకుంటుందా అని కాంచన బాధపడుతుంది. గెలిచానని అనుకుంటున్న మనిషి కాళ్ల దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్లిందని దీప అంటుంది. వేరేలా ఆలోచించాలని కార్తీక్ అంటాడు. చెప్పిన పనులు చేస్తే పని వాడే ఎందుకు అనుకోవాలని అని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు.

Advertisement

అది నా తాతగారి ఇల్లు.. నా తాత షూస్ క్లీన్ చేయడం నాకు చిన్నతనం కాదని అంటాడు. మా అత్తగారి ఫ్యామిలీ అందరూ కూర్చుంటే భోజనం వడ్డించా.. నువ్వు ఎప్పుడు వడ్డించలేదా అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. మనం కూర్చున్నప్పుడు మా అత్త వడ్డించలేదా అంటాడు. జ్యోత్స్న అగ్రిమెంట్ గురించి చెప్పింది కాబట్టి.. ఇలా చేస్తున్నాడేంటి అని మీరు బాధపడుతున్నారని చెబుతాడు. నా కొడుకుకు విలువ ఇవ్వని మనుషులు ఎవరూ వద్దు.. మేనకొడలైనా, అన్నయ్య అయినా, తండ్రి అయినా వద్దు అని కన్నీటితో అంటుంది సుమిత్ర. యుద్ధం మధ్యలో ఆపకూడదని కార్తీక్ చెబుతాడు. మీరు ఈరోజు పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు.. నేను రేపు జరిగే మంచి కోసం చూస్తున్నానని కార్తీక్ అంటాడు. మాట ఇచ్చానని, తప్పితే బతికి ఉన్నా చచ్చినట్టేనని అంటాడు. ఏం చేయాలో మీరు చెప్పండ‌ని అడుగుతాడు.

karthika deepam 2 Today Episode జ్యోత్స్నకు దీప ఫోన్‌ కాల్

ఆ వీడియోలను చూసి దీప రియాక్షన్ ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో జ్యోత్స్న దీప కాల్ చేస్తుంది. నిన్ను రెచ్చగొట్టి తప్పులు ఎలా చేయించాలో నాకు తెలుసు కదా అని అనుకుని కాల్ ఎత్తుతుంది జ్యోత్స్న. వీడియోలు చూశావా.. నచ్చాయా.. మరోసారి ఇంకా క్లారిటీగా వీడియోలు తీస్తా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది జ్యోత్స్న. నీకు ఏం కావాలి అని దీప అడుగుతుంది. ‘నీ మెడలో తాళి కావాలి, నీప్రాణం కావాలి’ అని అంటాను అనుకుంటున్నావా అంటూ వెటకారంగా నవ్వుతుంది జ్యోత్స్న. అవసరం లేదు నీ దగ్గరే పెట్టుకో అంటూ చెబుతుంది. మరి ఏం కావాలి అని దీప మళ్లీ అడుగుతుంది. నీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది జ్యోత్స్న. నా మీద పగతోనే కార్తీక్ బాబుతో అగ్రిమెంట్ రాయించుకుని, పని వాడితో చేయించుకోవాల్సిన పనులు చేయిస్తున్నావని దీప అంటుంది. కోపంగా ఉందా, కొట్టాలనిపించడం లేదా అని జ్యోత్స్న అంటుంది.

Advertisement

కార్తీక్‍ను వదిలేయాలని జ్యోత్స్నను దీప బతిమాలుతుంది. నీకు ఏం కావాలో ఇచ్చేసి కార్తీక్ బాబును విడిపించుకోవాలని ఉందని అంటుంది. దీప ఇలా మాట్లాడకూడదే.. కోపం వస్తే ఆవేశపడి కొట్టడానికి ఎగేసుకొని రావాలని అని వెటకారంగా అంటుంది. అలిసిపోయానని, అవమానాలు పడి, అభిమానించే వారికి దూరమవుతున్నానని దీప బాధపడుతుంది. జాలేస్తోంది దీప అని జ్యోత్స్న అంటుంది. మీరంతా ఒకే కుటుంబం, కార్తీక్‍ షూ తుడుస్తుంటే నీ మనసు ఎలా ఆనందించగలిగింది అని దీప అడుగుతుంది. నువ్వు చేస్తున్నది తప్పు అని నీ మనసు చెప్పడం లేదా అని అంటుంది. లేదని జ్యోత్స్న అంటుంది. నాకు ఎందుకు ఫోన్ చేశావని జ్యోత్స్న అడుగుతుంది. నా మీద కోపంతో కార్తీక్ బాబును ఏం చేస్తావోనని భయంతో చేశానని అంటుంది.

కార్తీక్ బాబు బ‌దులు నేను వస్తా..

కార్తీక్ బాబు బదులు నేను వచ్చి పనులు చేస్తానని దీప అంటుంది. కానీ జ్యోత్స్న అంగీకరించదు. అగ్రిమెంట్ చేసింది బావ అని అంటుంది. ఆసుపత్రిలో నేను చచ్చిపోయి ఉంటే అని దీప అంటే.. అప్పుడు ఈ అగ్రిమెంట్ ఉండేదే కాదు అని జ్యో అంటుంది. కార్తీక్ బాబు కోసం నేను ఏదైనా వదులుకుంటానని దీప అంటుంది. మరదలిని, ఆస్తిని, చివరికి తనను కార్తీక్ వదిలేసుకున్నాడని, నీ కోసం అన్నీ వదులుకునేంత ప్రేమ కార్తీక్‍లో ఎలా వచ్చిందని జ్యోత్స్న అంటుంది. తనకు ఇప్పటికీ క్లారిటీ దొరకని ప్రశ్న అదేనని చెబుతుంది.

కార్తీక్ బాబును వదిలెయ్.. అక్కడికి రారు అని జ్యోత్స్నతో దీప అంటుంది. ఎలా రప్పించుకోవాలో తెలుసు అని జ్యోత్స్న పొగరుగా చెబుతుంది. కార్తీక్ బాబును నాకు దూరం చేసి నీ వాడిని చేసుకోవాలనుకుంటున్నావేమో.. అదెప్పటికీ జరగదని దీప అంటుంది. కార్తీక్ బాబు మనసులో నువ్వు లేవు అని చెప్పేస్తుంది. కార్తీక్ నా మెడలో తాళి కట్టకపోయినా నిన్ను పెళ్లి చేసుకునే వాడు కాదని, ఆయనే ఈ విషయాన్ని చెప్పారని అంటుంది. నీ మెడలో తాళి అవసరం లేదని చెప్పా కదా అని అరుస్తుంది జ్యోత్స్న. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావని దీప అడుగుతుంది. నేను కార్తీక్ బాబును రానివ్వనని దీప అంటుంది. వస్తాడు.. రప్పిస్తా అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబును రానివ్వనని దీప అంటే.. ట్రై చెయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్న. ఇదంతా ఆపాలని దీప అనుకుంటుంది.

కార్తీక్‍ను అడ్డుకున్న దీప

కార్తీక్‍కు జ్యోత్స్న మేసేజ్‍లు చేస్తూనే ఉంటుంది. జ్యోత్స్న దగ్గరికి వెళ్లేందుకు కార్తీక్ బయలుదేరతాడు. దీప కంటపడకుండా వెళ్లిపోవాలని అనుకుంటాడు. కార్తీక్‍ను దీప అడ్డుకుంటుంది. నా కోసం అగ్రిమెంట్‍పై సంతకం పెట్టారు కాబట్టి.. జ్యోత్స్న దగ్గరికి నేను వెళతానని దీప అంటుంది. ఇప్పటి నుంచి కార్తీక్ బాబు స్థానంలో నీకు అసిస్టెంట్‍గా నేను ఉంటానని జ్యోత్స్నతో చెబుతానని దీప అంటుంది. అందుకు నేను ఒప్పుకోనని కార్తీక్ తేల్చేస్తాడు. వెళ్లడానికి నేనూ ఒప్పుకోను దీప అంటుంది.

Advertisement

తప్పుకో.. మొండిపట్టు పట్టకు అని కార్తీక్ అంటాడు. అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా తర్వాత చెబుతానని చెబుతాడు. కానీ దీప వినదు. మిమల్ని ఆ జ్యోత్స్న బాధపెడుతుంటే చూడలేనని అంటుంది. ఆ బాధ వెనుక కారణం వేరే ఉందని, విసిగించకు, అర్థం చేసుకో అని కార్తీక్ అంటాడు. వెళ్లొద్దని దీప అంటూనే ఉంటుంది. “మతిలేకుండా మాట్లాడొద్దు.. జ్యోత్స్న చెప్పినట్టు తల ఆడించడానికి నేను అమాయకుడిని కాదు. నేను చేస్తున్న ప్రతీ పని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి” అని కార్తీక్ అంటాడు. నా కోసమే కదా అని దీప అంటుంది. అసలు వెళ్లనివ్వనని అడ్డంగా నిలిచి మొండికేస్తుంది. మర్యాదగా తప్పుకుంటావా.. తోసుకెళ్లనా అని కార్తీక్ అంటాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్లాలనుకుంటే నా శవాన్ని దాటి వెళ్లండని దీప అంటుంది. నీకు మతిపోయింది దీప అని కార్తీక్ అంటాడు. మీరు పనులు చేస్తుంటే నిజంగానే మతిపోయిందని దీప చెబుతుంది. నేను చేసే వాటి వెనుక కారణం ఉందని కార్తీక్ చెబుతాడు. రెండు కుటుంబాలను కలిపేందుకే కదా.. అవసరం లేదని దీప అంటుంది. నిన్ను ఆ కుటుంబానికి దూరం చేయాలి కాబట్టి అని కార్తీక్ అంటుంది. ఎందుకు దగ్గర చేయాలని దీప ప్రశ్నిస్తుంది.

నా అసలైన మరదలివి

దీపను చేయి పట్టుకొని పక్కకు తీసుకెళతాడు కార్తీక్. “వాళ్లేనన్ను వద్దనుకొని, అసహ్యించుకున్నారు. ఇంకా ఆ కుటుంబం ఎందుకు కావాలి. నన్ను ఎందుకు కలపాలి అనుకుంటున్నారు” అని దీప అడుగుతుంది. నువ్వే సుమిత్ర, దశరథ్ అసలైన కూతురు అని దీపతో నిజం చెప్పేస్తాడు కాార్తీక్. “ఎందుకంటే నువ్వు నా మేనత్త కూతురివి కాబట్టి” అని చెబుతాడు. దీంతో దీప షాక్ అవుతుంది. మేనత్త కూతురినా అని అనుమానంగా అడుగుతుంది. “అవును నువ్వు ఎవరో కాదు.. మా సుమిత్ర అత్త, దశరథ్ మామయ్యల కన్నకూతురివి. నా సొంత మరదలివి. నా తల్లికి మేనకోడలివి. శివన్నారాయణకు సొంత మనవరాలివి. ఆ యావదాస్తికి ఒక్కగానొక్క వారసురాలివి” అని కార్తీక్ నిజాలు చెప్పేస్తాడు. దీంతో దీప షాక్‌కు గుర‌వుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి సోమ‌వారం ఎపిసోడ్ ముగుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి