Home » News » Karthika Deepam Vantalakka Premi Viswanath Properties Net Worth
News

Karthika Deepam Vantalakka : వంట‌ల‌క్క ఆస్తుల వివ‌రాలు తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: January 28, 2025 3:48 pm
Advertisement

Karthika Deepam Vantalakka : కార్తీక దీపం సీరియ‌ల్ ఫాలో Karthika Deepam అయ్యే వారికి వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కు బాగా సుప‌రిచితం. ఆమె స్క్రీన్ పైన కనిపిస్తే.. దిల్ ఖుష్ అవుతారు లేడీస్. టాలీవుడ్ లో హీరోయిన్ లకు ఎంత ఇమేజ్ ఉందో.. బుల్లితెరపై ప్రేమీ విశ్వనాథ్ కు అంత ఇమేజ్ ఉంది. ఆమె గురించి తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. రియల్ తెచ్చిన క్రేజ్‌తో.. ఈమెకు ఇటీవల వరుసపెట్టి ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. అటు సీరియల్స్.. ఇటు యాడ్స్‌తో పాటు నాగచైతన్య హీరోగా వచ్చిన ‘కస్టడీ’ సినిమాలోనూ కీలక పాత్రలో నటించింది ప్రేమి విశ్వనాథ్.

Advertisement

Karthika Deepam Vantalakka : వంట‌ల‌క్క ఆస్తుల వివ‌రాలు తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

Karthika Deepam Vantalakka అన్ని ఆస్తులా..

ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల విషయంపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటలక్క ఆస్తులు సుమారు రూ. 40 కోట్లు ఉండచ్చునని అంచనా. ఆమెకు కేరళలో రెండు స్టూడియోలు కూడా ఉన్నాయట. అలాగే వంటలక్క ‘కార్తికదీపం’ సీరియల్‌లో నటిస్తూనే ‘ఫ్లవర్స్ టీవీ’లో ఓ హోస్ట్‌గా చేస్తోందట. అటు ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ఆస్ట్రాలజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి..మలయాళంలో ‘అకమే’ అనే షార్ట్ ఫిలిం‌లో నటించి.. ప్రొడ్యూస్ చేసింది ఈ బ్యూటీ. వంట‌ల‌క్క‌కి ఓ స్టూడియో ఉండ‌గా, ఆ స్టూడియోలలో మలయాళ ఇండస్ట్రీకి సబంధించిన సినిమాలు, సీరియళ్ల షూటింగ్స్ జరుగుతాయని తెలుస్తోంది.

Advertisement

ఇక్కడ కార్తీక దీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ప్రేమీ విశ్వనాథ్ అక్కడ ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా చేసింది. అంతే కాదు పెద్ద ఫ్యామిలీ కలిగి ఉన్న ప్రేమీవిశ్వనాథ్ భర్త ఒక ఫ్రొఫిషినల్ ఆస్ట్రాలజర్ అని తెలుస్తోంది. ఆమె భర్త పేరు డాక్టర్ వినీత్ భట్ . ఆయన 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా అవార్డ్ కూడా తీసుకున్నాడట. ఇక ఈ అమ్మ‌డు డాక్టర్ బాబుతో ఆమె ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచేసింది. మరీ ముఖ్యంగా మహిళా మణులు వంటలక్క క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. నేషనల్ లెవల్లో టీఆర్‌పీ రికార్డులు కొల్లగొడుతూ కార్తీక దీపం సీరియల్ రికార్డులు సృష్టించింది

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి