
Sudigali Sudheer : సుధీర్‌కి హగ్గుల మీద హగ్గులు ఇచ్చిన బిగ్ బాస్ భామ.. మిగతా వాళ్లకి అసూయ వచ్చేసిందిగా..!
Sudigali Sudheer : జబర్ధస్త్ షోతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి ఇప్పుడు సుధీర్ హీరోగా ఎదగాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సుధీర్ కి బుల్లితెరపై ఆల్రెడీ క్రేజ్ వచ్చింది. స్టైలిష్ లుక్స్ ఉండడంతో హీరోగా పనికొస్తాడని పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు చేస్తున్నారు. సుధీర్ వరుసగా హీరోగా చిత్రాలు చేస్తున్నాడు కానీ హిట్స్ పడడం లేదు. ఈ క్రమంలో తనకి అచ్చొచ్చిన బుల్లితెరపై మళ్లీ సందడి చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరహాలో సరదాగా సాగే ఈ షో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. మరోవైపు ఆహా వేదికగా సర్కార్ అనే షో చేస్తున్నాడు. ఈ షో కూడా మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది.
సర్కార్ పదో ఎపిసోడ్ ప్రోమోని రీసెంట్‌గా ఆహా ఓటీటీ తమ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా షేర్ చేసింది. “రంగుల లోకం, అందాలు ప్రత్యక్షం.. సర్కార్ తో చెయ్యొద్దు మీరు పరిహాసం” అనే క్యాప్షన్ తో ఈ కొత్త ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఇందులో నలుగురు అమ్మాయిలు సందడి చేశారు. వారిలో స్రవంతి, శుభ శ్రీ, హమీదా, శోభా శెట్టిలు ఉన్నారు. వారిని చూసిన సుధీర్ కు కవిత్వం పొంగుకొచ్చేసింది. ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎంతో మంది చచ్చిపోతారు పాము కుట్టి.. ఇప్పుడొస్తుంది శోభా శెట్టి.. నిన్ను ఇంత అందంగా పుట్టించినందుకు శుభ శ్రీ.. ఆ దేవుడికి ఇవ్వాలి పద్మ శ్రీ.. దేవకన్యలు తిరుగుతారు భూమ్మీద.. దానికి సాక్ష్యమే హమీదా.. ఇలా సుధీర్ తన కవిత్వంతో తెగ ఇంప్రెస్ చేశాడు.
Sudigali Sudheer : సుధీర్‌కి హగ్గుల మీద హగ్గులు ఇచ్చిన బిగ్ బాస్ భామ.. మిగతా వాళ్లకి అసూయ వచ్చేసిందిగా..!
ఈ ప్రోమో తర్వాత సుధీర్- హమీదా గురించే టాక్ వైరల్ అవుతోంది. షోలో అడుగుపెట్టినప్పటి నుంచి షో ముగిసే వరకు హమీదా- సుధీర్ హగ్గులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. సుధీర్ ఏ చిన్న మాట చెప్పినా కాంప్లిమెంటరీగా హగ్గులు ఇచ్చేసింది హమీదా. ఇప్పటి వరకు ఈ షోలో ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్ మాత్రం లేవు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అయితే వీళ్లిద్దరి బాండింగ్ భలే ఉంది అని అంటున్నారు.. ఈ షోలో ఇంకో ముగ్గురు బ్యూటీలు షోకి గ్లామర్ పెంచేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ మంచి మజా అందించడం ఖాయం అంటున్నారు.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.