
Suma : మూడో బిడ్డ అందుకే కనలేకపోయా.. ఇన్నాళ్లకి సీక్రెట్ బయటపెట్టిన సుమ
Suma : టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లో సుమ ఒకరు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపై మహారాణిలా ఓ వెలుగు వెలుగొందుతోంది. ముఖ్యంగా సినిమా ఈవెంట్లతో పాటు పలు షోలు చేస్తూ తెగ రచ్చ చేసే సుమ ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ హంగామా చేస్తుంది. అందం, అంతకు మించిన మాటలతో అందరినీ మెస్మైరైజ్ చేస్తూ.. ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒకపక్క గ్లామర్‌తో కొత్త కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా… తన ప్రత్యేకమైన నైపుణ్యంతో వాళ్లందరినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే ఇటీవలే ఓ సినిమా కూడా చేసింది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి వరుసగా వీడియోలు విడుదల చేస్తుంది.
కెరియర్ పరంగా టీవీలో షోలు చేస్తూ.. పిల్లలను చూసుకోకుండా ఉండడం కంటే ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేలా సుమ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ మధ్య సుమ అడ్డా షో తప్ప మరేవీ చేయకుండా.. యూట్యూబ్ పై ఫోకస్ చేసిందట. ఇక మిగతా సమయాల్లో కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రమే వెళ్తుందట. గతంలో శనివారం ప్రసారం అయ్యే సుమ అడ్డా షో ఇప్పుడు మంగళవారం ప్రసారం అవుతోంది. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా, ఈ ఎపిసోడ్ లో బుల్లితెర నటీనటులు సందడి చేస్తున్నారు. సుమ ఎప్పటిలాగే సుమ వారితో కలసి కామెడీ పంచ్ లతో నవ్వులు పూయించింది.
Suma : మూడో బిడ్డ అందుకే కనలేకపోయా.. ఇన్నాళ్లకి సీక్రెట్ బయటపెట్టిన సుమ
ఓ బుల్లితెర నటి మాట్లాడుతూ.. తాము నటిస్తున్న సీరియల్ ముగిసిన తర్వాత బ్రేక్ దొరికింది. ఆ గ్యాప్ లో తాను నేను బాబుని కన్నాను.. అది పాపని కనేసింది.. వాడు బాబుని కన్నాడు అంటూ తన తోటి నటీనటుల్ని చూపిస్తూ ఫన్నీగా చెప్పింది. అంతే తమకి పిల్లల్ని కనే కనేందుకు కూడా చాలా తక్కువ గ్యాప్ దొరికినట్లు చెప్పింది. వెంటనే సుమ స్పందిస్తూ… ఇప్పుడు మీకు అర్థం అయింది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేశానో.. మూడో బిడ్డని కనాలనుకున్నా టైం లేదు అన్నట్లుగా చెప్పింది. వాళ్ళు టివి సీరియల్స్ తో బిజీ అయితే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో, టివి షోలతో తీరిక లేకుండా గడుపుతున్నానని సుమ పేర్కొంది. ప్రస్తుతం సుమ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.