
Bride Mass Dance Video in youtube
Viral Video : నేటి తరం యువతీయువకులు సమాజంలో నడుస్తున్న ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరైనా ఏదైనా కొత్తగా చేస్తే చాలు వారు కూడా అదేవిధంగా చేయాలని భావిస్తున్నట్టు యువత బాహాటంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే, నేటితరం యువత తమ చదువు, ఉద్యోగం, పెళ్లి విషయంలో మాత్రం తల్లిదండ్రుల మాట కంటే తమకు నచ్చినట్టు చేస్తున్నట్టు పలు సర్వేలు ఇప్పటికే కుండబద్దలు కొట్టాయి. చదువు, ఉద్యోగం విషయంలో పేరెంట్స్ మాట వింటున్న కొందరు.. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమకు నచ్చిన వారిని చేసుకోవడంలో ఏమాత్రం జంకడం లేదు.
కొందరు ఇంట్లో వారిని ఒప్పించి చేసుకుంటుంటే మరికొందరు ప్రేమ పెళ్లిళ్లు గోప్యంగా చేసుకుంటున్నారు. అయితే, లవ్ లేదా అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వారు జీవితంలో వివాహం అనేది ఒక్కసారే వస్తుందని గ్రాండ్‌గా చేసుకోవాలని, డెస్టినేషన్ వెడ్డింగుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, ఫోటోస్ కోసం లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఇదేంటని అడిగితే మాకు మెమోరీస్ ఉండాలి కదా అని నిర్మోహమాటంగా చెబుతున్నారు. పాత తరం వారికి ఇదంతా కొత్తగా అనిపించినా నేటితరం వారు మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. మొన్నటివరకు పెళ్లి జరిగాక డ్యాన్సింగ్ వంటి ప్రొగ్రామ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే సంగీత్ నిర్వహిస్తున్నారు.
Bride Mass Dance Video in youtube
కొన్ని చోట్ల పెళ్లి కూతురును డోలి, బుట్టల్లో తీసుకొస్తే.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం పెళ్లికూతురు ఓ పది మందితో కలిసి డ్యాన్సులు వేసుకుంటూ పెళ్లి మండపంలోకి వస్తుంది. ఇలాంటి ఘటనే తాజాగా కేరళలో జరిగిన ఓ పెళ్ళిలో వెలుగుచూసింది. పెళ్లి కూతురు ముందు, ఓ గ్రూప్ వెనుక నుంచి మాస్ డ్యాన్సులు వేసుకుంటూ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా పెళ్లి కొడుకు నోరెళ్లబెట్టాడు. పెళ్లి హాల్‌లోని బంధువులు అమ్మాయిని వీడియో, ఫోటోలు తీస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
This website uses cookies.