Bride stunning Dance video on youtube
Viral Video : కొత్తగా పెళ్లైన జంటలకు బుల్లెట్ బండి సాంగ్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది. యువజంటలకే కాకుండా చిన్నపిల్లలు,పెద్దవారికి సైతం ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏ ఫంక్షన్, ఈవెంట్ జరిగినా సింగర్ మోహన భోగరాజు పాడిన బుల్లెట్ బండి సాంగ్ తప్పకుండా వినిపిస్తుంది. దీనికి అంతా క్రేజ్ తీసుకొచ్చింది సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం.. సింగర్ వాయిస్, సంగీతం ఆ పాటకు ప్రాణం పోస్తే సోషల్ మీడియా దానికి పాపులారిటీ తీసుకొచ్చింది.
ఈ పాట వచ్చిన నాలుగు నుంచి ఐదు నెలల తర్వాత అనుకోకుండా వైరల్ అయ్యింది. అప్పటివరకు యూట్యూబ్‌లో దీనికి పెద్దగా వ్యూస్ కూడా లేవు. సాదా సీదా వ్యూస్‌తో నడుస్తున్నా ఈ సాంగ్.. ఎప్పుడైతే సోషల్ మీడియాలో అందరూ ఈ సాంగ్‌ను రీమేక్ చేయడం ప్రారంభించారో నాటి నుంచి బుల్లెట్ బండి సాంగ్ జనాల్లోకి వెళ్లింది. నెలకిందట ఈ సాంగ్‌కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. సినిమా యాక్టర్స్, చిన్న పిల్లలు, సోషల్ మీడియా స్టార్స్ వీరంతా ఈ సాంగ్‌కు స్టెప్పులు వేసినవారే. దీంతో సింగ్, సాంగ్ మేకర్స్‌కు చాలా మంచి పేరు వచ్చింది.
Bride stunning Dance video on youtube
ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం ఈ సాంగ్ గొప్పతనాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా మెచ్చుకున్నారు. అలాంటిది బుల్లెట్ బండి సాంగ్ మళ్లీ వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లైన జంటలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుండటంతో దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదని అర్థమవుతోంది. పెళ్లి కూతర్లు ఎక్కడ చూసినా ఈ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు వేస్తున్నారు. దీంతో ఈ సాంగ్‌కు పడిపోయిన డిమాండ్ మళ్లీ ఒక్కసారిగా వచ్చినట్టు అయ్యింది. సాధారణ ఫంక్షన్లలో కంటే పెళ్లిబారాత్‌లోనే బుల్లెట్ బండి సాంగ్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది.
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
This website uses cookies.