Home » News » Driver Accidentally Crashes Car Into Store Video
News

Viral Video : షాపింగ్ మాల్ లోకి దూసుకొచ్చిన కారు.. సినిమా షూటింగ్ ని త‌ల‌పించిన ఇన్సిడెంట్.. వీడియో వైర‌ల్

Authored By
mallesh
The Telugu News | Published on: June 9, 2022, 11:00 am
Advertisement

Viral Video : నిత్యం సోష‌ల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూస్తుంటాం. ఎక్కువ‌గా జంతువుల‌, ప‌క్షుల ఫ‌న్నీ వీడియోస్ వైర‌ల్ అవుతుంటాయి. అలాగే కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల వీడియోలు చూస్తుంటాం. ఇందులో కొన్ని ఫ‌న్ క్రియేట్ చేస్తే మ‌రికొన్ని భ‌య‌పెట్టిస్తాయి. అయితే రోడ్ల‌పై ఎన్నో ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. అందులో కొన్ని సీసీ కెమెరాల్లో న‌మోదు అవుతాయి. వీటిని చూసిన‌ప్పుడు చాలా ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఇలాంటి కొన్ని కొన్ని వీడియోలు బాధిస్తాయి.

Advertisement

అయితే ఈ ప్ర‌మాదాలు ఎక్కువ‌గా అనుకోకుండా జ‌రుగుతాయి. మ‌రికొన్ని డ్రైవింగ్ స‌రిగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల జరుగుతుంటాయి. ప్ర‌స్తుతం ఇలాంటి వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అమెరికాలోని టెంపే సిటీలోని ఓ షాపింగ్ మాల్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. షాపింగ్ మాల్ లో ఇద్ద‌రు వ్య‌క్తులు మాట్లాడుకుంటుండగా స‌డెన్ ఓ వైట్ కారు లోనికి దూసుకొచ్చింది. అక్క‌డున్న ఇద్ద‌రిని ఢీకొని అలాగే లోప‌లికి వెళ్లిపోయింది. దీంతో ఇద్ద‌రికి గాయ‌ల‌ల‌య్యాయి.

driver accidentally crashes car into store video

Advertisement

అలాగే షాపింగ్ మాల్ లో మెటీరియ‌ల్ ధ్వంసం అయింది. కాగా గాయ‌ప‌డిన వారిని వెంట‌నే హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. కాగా డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తేల్చారు. డ్రైవ‌ర్ బ్రేక్ పైన కాలు వేయాల్సిందిపోయి పొర‌పాటున ఎక్స్ క‌వేట‌ర్ పై వేశాడు. దీంతో ఒక్క‌సారిగా కారు ఎంట్రెన్స్ నుంచి లోనికి దూసుకొచ్చింది. కాగా పోలీసులు డ్రైవ‌ర్ ని విచారిస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌న సీసీ కెమెరాల్లో న‌మోదు అయింది. కాగా సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి