Viral Video : ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాం చూసిన యువత ఇన్ స్టా రీల్స్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇన్ స్టాగ్రామ్ రీల్సే వారి ప్రపంచం. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి తెగ వీడియోలు తీస్తూ ఫ్రొఫైల్‌లో అప్డేట్ చేస్తున్నారు. వాటికి లైక్స్ షేర్స్ రాగానే సెలబ్రిటీలము అయిపోయామని తెగ ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రస్తుతం సొసైటీలో నడిచేది ఇన్ స్టా రీల్స్ హవానే.. ఎక్కడ పడితే అక్కడ యువత రీల్స్, డ్యాన్స్ చేస్తూ తమ టాలెంట్‌ను బయట పెడుతున్నారు. ఒకప్పుడు డాబ్ స్మాష్ , టిక్ టాక్ వంటి యాప్స్ ద్వారా చాలా మంది యువత తమలోని టాలెంట్‌ను బయటపెట్టారు.
అది వారికి టైంపాస్ మాద్యమమే అయినా వారికి చాలా పాపులారిటీని తీసుకొచ్చింది. టిక్ టాక్ పుణ్యమా అని కొందరు ఏకంగా సెలబ్రిటీలు కూడా అయిపోయారు. వారికి బుల్లితెర, బిగ్ స్క్రీన్ మీద కూడా ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇండియాలో టిక్ టాక్ పై బ్యాన్ నడుస్తుండటంతో యువత ఇన్ స్టాగ్రామ్‌కు అడిక్ట్ అయిపోయారు. టిక్‌టాక్ లాంటి ఫీచర్స్ ఉండటంతో ఇప్పుడంతా ఇన్ స్టా రీల్స్ హవానే నడుస్తుంది. కేవలం యువత మాత్రమే కాకుండా ఉద్యోగులు, భార్యభర్తలు, చిన్నపిల్లలతో కలిసి వారి తల్లిదండ్రులు కూడా రీల్స్ చేసి తమలో దాగియున్న టాలెంట్‌ను బయటకు తెస్తున్నారు. వారి రీల్ హిట్టా ఫట్టా అనేది దానికి వచ్చిన లైక్స్, షేర్స్ పై ముడిపడి ఉంటుంది.
కొంచెం అందంగా ఉంది అద్భుతంగా ముఖకవలికలు ఇచ్చే అమ్మాయిలు, అబ్బాయిల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అది చూసి వారు జీవితంలో ఏదో సాధించామని తెగ మురిసి పోతుంటారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో ఇద్దరు అమ్మాయిలు అరబిక్ కుత్తు సాంగ్స్‌కు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఏకంగా 3లక్షలకు పైగా లైక్స్‌ను సంపాదించాయి. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వారి డ్యాన్స్‌ను చూసిన వారంతా లవ్ సింబల్స్, లైక్స్‌తో ఇన్ స్టాను హోరెత్తిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.