Home » News » House Owner Tortures Minor Girl Video Viral
News

Viral Video : ఇంట్లో పనిచేసే బాలికకు కాల్చి వాతలు పెట్టిన మహిళ.. బాలిక తల్లిదండ్రులు ఆ మహిళను ఏం చేశారంటే?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: July 19, 2023 8:15 pm
Advertisement

Viral Video : ఏదో ఒక పని చేసుకొని బతికినా కూడా తప్పే ఈ కాలంలో. ఇళ్లలో పని చేసేవాళ్లు, కూలీ పని చేసుకునే వాళ్లు, కార్మికులు అంటే అందరికీ చిన్నచూపే. వాళ్లను ఎంత చులకనగా చూస్తారంటే వాళ్లు ఏమాత్రం ఎదురు తిరిగినా వాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. చితక్కొడతారు. నిజాయితీగా బతుకుదామన్నా సోకాల్డ్ రిచ్ పీపుల్ బతకనివ్వరు. డబ్బు ఉందనే అహంకారం వాళ్లను అలాంటి పనులు చేయిస్తుంది. మైనర్లతో పనులు చేయించుకోవడాలు.. వాళ్లకు సరైన తిండి కూడా పెట్టరు. హింసిస్తారు. సరిగ్గా జీతం కూడా ఇవ్వరు.

Advertisement

తాజాగా ఓ మహిళ అయితే తన ఇంట్లో పనిచేసే బాలికను తీవ్రంగా హింసించి కాల్చి వాతలు పెట్టింది. బాలిక ఇంటికెళ్లి తన తల్లిదండ్రులకు తన యజమాని చేసిన పని గురించి చెప్పింది. తన చేతులు, కాళ్లు, ముఖం మీద ఉన్న వాతలు చూసి ఆ బాలిక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో వెంటనే ఆ మహిళ ఇంటికి వెళ్లారు.ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకలో చోటు చేసుకుంది. ఓ మహిళా పైలట్ ఇంట్లో ఆ బాలిక పని చేస్తోంది. వయసు 10 ఏళ్లు కూడా ఉండవు. ఆ బాలికతో వెట్టి చాకిరి చేయించుకునే ఆ మహిళ రోజూ చిత్రహింసలు పెడుతుండేది.

house owner tortures minor girl video viral

Advertisement

Viral Video : మహిళను, ఆమె భర్తను చితకబాదిన బాలిక తల్లిదండ్రులు

చివరకు ఒకరోజు కాల్చి వాతలు పెట్టడంతో ఆ బాలిక ఒంటిపై ఎక్కడ చూసినా కాల్చిన గాయాలే. ఆ గాయాలను చూసి బాలిక తల్లిదండ్రులు తట్టుకోలేక వెంటనే ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను, తన భర్తను రోడ్డు మీదికి లాక్కొచ్చి మరీ చితక్కొట్టారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైలేవల్ జాబ్స్ చేస్తూ కూడా ఇలా చిల్లరగా ప్రవర్తించడం ఏంటంటూ ఆ మహిళా పైలట్ పై ఇరుగుపొరుగు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి