VIral video : కదిలే విమానంలోనే విమాన సిబ్బందితో కలిసి లవర్ కి.. సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియుడు వీడియో వైరల్..!!
VIral video : ఓ యువకుడు తన ప్రియురాలిని సర్ప్రైజ్ చేయడానికి అదిరిపోయే ప్లాన్ ఏసాడు. ఏకంగా విమాన సిబ్బందితో ముందుగానే మాట్లాడుకుని తన ప్రియురాలు ఇంకా విమానంలో రాకముందు ఆమెకు ప్రపోజ్ చేయబోతున్నట్లు దానికి అందరూ సహకరించాలని సదరు ప్రియుడు కోరడం జరిగింది. ఈ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. ఇందుకు ఎయిర్ ఇండియా ఉద్యోగస్తులు సైతం ఓకే చెప్పటంతో సరిగ్గా విమానం కదిలే సమయంలో…
ఒక చాటు పట్టుకుని మెల్లగా ప్రియురాలు కూర్చున్న సీటు వద్దకు ప్రియుడు వచ్చి…”నేను జీవితాంతం నీతో నడవాలి అనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో కలిసి నడుస్తావా..?..” అని ఉన్నావో చార్ట్ లో ఆమెకు తన ప్రేమను వ్యక్త పరచడం జరిగింది. దీంతో ఒక్కసారిగా యువతి ఆశ్చర్యపోయింది. మెల్లగా తన సీటు నుంచి లేచి అతని వద్దకు వెళ్లడంతో యువకుడు మోకాలి పై కూర్చుని వెంటనే జోగిలో ఉన్న రింగు బాక్స్ తెరిచి… ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఆనందంతో అతడిని ఒక్కసారిగా హత్తుకుంది. విమానంలో మిగతా ప్రయాణికులు అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉండగా ఇద్దరు సంతోషపడటంతో అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టి జంటను అభినందించారు.
love proposal in Flying flight VIral video
అయితే ఈ ఘటనకి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్ననే విమాన సిబ్బందిపై ఒకరు దురుసుగా ప్రవర్తించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు విమానంలో లవర్ కి అబ్బాయి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇలా ఎగిరే విమానంలో.. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఒకపక్క విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.
