OLD WOMAN DANCE Bullet Bandi Song on Video
Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ వినిపిస్తే చాలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ ఏదో తెలియని ఊపు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరి పెళ్లిలో అయినా ప్రధానంగా ఈ సాంగే హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే చిన్నపిల్లలు, అమ్మాయిలు ఈ సాంగ్‌కు అదిపోయే స్టెప్పులు వేశారనుకుంటే అంతా కామన్ అనుకుంటారు. కానీ 60 ఏళ్ల బామ్మ కూడా బుల్లెట్ బండి సాంగ్‌కు రెచ్చిపోయి మరీ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లకు ఒక్కసారి ఏదైనా కనెక్ట్ అయితే అవి వైరల్ కావాల్సిందే.
అలా చాలా వీడియోస్‌ను నెటిజన్లు గంటల వ్యవధిలోనే వైరల్ చేసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే జనాల్లో ఆ హవా కొంత కాలం ఉండిపోతుంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కాదు ఆఫ్ లైన్ లో ‘బుల్లెట్ బండి’ పాట హవా కొనసాగుతుంది. సోషల్ మీడయాలో ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీ యువకులు వారి డ్యాన్స్ చేసిన వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు. వారికి నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ చీర కొంగు బిగించి ఈ బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ఓ వృద్ధురాలు. భర్త మంచం పై కూర్చొని వుండగా.. సుమారు 60 ఏళ్లకు పైగా వయస్సు వున్న ఓ వృద్ధురాలు బుల్లెట్ బండి పాటకి తనదైన శైలిలో స్టెప్పులేసి ఆకట్టుకుంది.
OLD WOMAN DANCE Bullet Bandi Song on Video
తన భర్త మంచం పై కూర్చొని వుండగా పాట బీట్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేసింది. అయితే, ఆమె భర్త మాత్రం ఆమె చేస్తున్న డ్యాన్స్ చూస్తూ అలా కూర్చుండి పోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామ్మ సూపర్ డ్యాన్స్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సంగీతాన్ని ఏంజాయ్ చేయడానికి వయస్సుతో సంబంధం లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు.అయితే, ఈ పాటను మోహన భోగరాజు పాడిన విషయం తెలిసిందే. ఆమె పాడి స్వయంగా నటించిన ఈ సాంగ్ సినిమా సాంగ్స్ కంటే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. దీంతో సింగర్ మోహన భోగరాజు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.