
Samantha : సమంత ఏంటి ఇంత కష్టపడిపోతుంది .. !! జిమ్ లో హార్డ్ వర్కౌట్స్ చేస్తు .. వీడియో
Samantha : సౌత్ బ్యూటీ సమంత ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తుంటారు సామ్. ఎప్పుడు ఫిట్ గా ఉండేందుకు సమంత శ్రమిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా సమంత వర్కౌట్స్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో టైట్ ఫిట్ డ్రెస్ వేసుకొని రెండు చేతులతో కార్యులాను పట్టుకొని హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు వావ్ సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల పరంగా ఫుల్ బిజీ అయిపోయారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ లో కూడా తెరంగేట్రం చేశారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. అలాగే హాలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇక మరోవైపు యాడ్స్ చేస్తూనే సినిమాలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేకిచ్చినట్లుగా తెలుస్తుంది. ఖుషి సినిమాతో హిట్ అందుకున్న సమంత తెలుగులో కొత్త సినిమాలకు కమిట్ అయినట్లు గా లేదు. దీంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని తెలుస్తుంది.
అయినా కానీ సమంత జిమ్లో వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ఎన్ని ట్రోల్స్, రూమర్స్ వచ్చిన తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ దూసుకెళుతున్నారు. ఇకపోతే సమంత సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మయోసైటీస్ వ్యాధి కారణంగా తాను కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటారని తెలుస్తుంది. కానీ ఆమె జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ మరి ఇంతలా హార్డ్ వర్క్ చేయకు సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.