Home » Entertainment » Sri Reddy A Strong Counter To Pavitra Lokesh
Entertainment

Sri Reddy : ప‌విత్ర లోకేష్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన శ్రీ‌రెడ్డి.. వాళ్ల‌పై మ‌రోసారి ఫైర్ ..

Authored By
mallesh
The Telugu News | Published on: July 4, 2022, 4:30 pm
Advertisement

Sri Reddy: సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, ప‌విత్ర లోకేష్ మ‌ధ్య సంబంధం.. నరేష్ మూడో భార్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం.. దీనిపై న‌రేష్.. ప‌విత్ర లోకేష్ కూడా స్పందించ‌డం అన్నీ తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక రిసెంట్ గా న‌టి శ్రీ‌రెడ్డి కూడా ఘాటుగా స్పందించింది. ఓ రేంజ్ లో అందరిపై ఫైర్ అయింది. తాను మీ టూ విష‌యంలో మాట్లాడిన‌ప్పుడు అంద‌రూ త‌న‌పై ఆరోప‌ణ‌లు చేశార‌ని ఇప్పుడేమైంది.. క‌ర్మ అంద‌రికీ ఇచ్చిప‌డేస్తోంది.. అంటూ గ‌ట్టిగానే స‌మాధానం చెప్పింది. ఫేస్ బుక్ లైవ్ లో పొట్టి డ్రెస్సులో క‌స‌ర‌త్తులు చేస్తూ ప‌లువురిపై విరుచుకుప‌డింది. ముఖ్యంగా న‌రేష్.. ప‌విత్ర‌ లోకేష్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. స్పెష‌ల్ ప‌విత్ర లోకేష్ ని అప‌విత్ర లోకేష్ అంటూ మాట్లాడుతూ.. న‌రేష్ భార్య విష‌యంలో మాట్లాడేందుకు నువ్వు ఎవ‌రు..? ఫైర్ అయింది.

Advertisement

న‌రేష్ భార్య బెంగుళూర్ కి వెళ్లి మాట్లాడితే నీకేంటి..? ఆమె ఎక్కడ అయిన మాట్లాదేందుకు హక్కు ఉంది. ఇతరుల జీవితాల్లో ని ప్పులు ఎందుకు పోస్తున్నావు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మీ టూ ఉద్యమం గురించి మాట్లాడితే.. త‌మ‌కు వ్యతిరేకంగా మాట్లాడింద‌ని.. నువ్వుమాత్రం ఎంతమందితోనైనా రిలేష‌న్షిప్ లో ఉండొచ్చా.. అంటూ ప్ర‌శ్నించింది. ఇక నరేష్ గురించి మాట్లాడుతూ త‌న‌ని మా అసోసియేషన్‌లో నాలుగు సంవత్సరాలు బ్యాన్ చేశాడ‌ని ఫైర్ అయింది. అతను నలుగురుని పెళ్లి చేసుకోవ‌చ్చు.. ఎంత‌మందితోనైనా రిలేష‌న్ మెయింటైన్ చేయొచ్చా.. అని క‌డిగేసింది. అలాగే మెగా ఫ్యామిలీపై మ‌రోసారి విరుచుకుప‌డింది. మీ టూ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు ఏమ‌య్యాయో అంద‌రికీ తెలిసింది.. క‌ర్మ ఎవ‌రనీ వ‌దిలిపెట్ట‌దు అంటూ ఫైర్ అయింది. వాళ్ల మూవీస్ అట్టర్ ఫ్లాపులు అవుతున్నాయ‌ని.. త‌ను ఓడిపోలేద‌ని త‌న ఉద్యమం ఫలాలు ఈ రోజు వస్తున్నాయ‌ని చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ లో త‌న‌కు అవ‌కాశాలు రాకుండా తొక్కేశార‌ని..

sri reddy a strong counter to Pavitra lokesh

Advertisement

Sri Reddy : మెగా ఫ్యామిలీపై మ‌రోసారి..

ప్ర‌స్తుతం తమిళనాడుకు వచ్చి త‌న‌కంటూ అభిమానులు, స్నేహితులను దక్కిన్చుకున్నాన‌ని చెప్పింది. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ మాత్రమే కష్టపడి కెరీర్ లో పైకి వచ్చాడ‌ని ప్ర‌శంసించింది. తాను ఎన్ని క‌న్నీళ్లు కార్చానో త‌న దిండుకే తెలుస‌ని.. ఎంత బాధ అనుభ‌వించానో.. త‌న‌కే తెలుస‌ని.. త‌న‌కు ఎవ‌రూ హెల్ప్ చేయ‌లేద‌ని చెప్పింది. త‌ను త‌ప్పుచేశాన‌ని.. మీ కూతుళ్లు అయితే త‌ప్పు చేయారా.. అంటూ ప‌లువురి ప్లేరు చెబుతూ మీరంద‌రూ న‌శ‌నం అయిపోవాల‌ని కోరింది. ఇది ఆడ‌పిల్ల‌ల‌ని ఏడ్పించే ఏ ఒక్క‌రినీ క‌ర్మ వ‌దిలి పెట్ట‌ద‌ని.. ఇండ‌స్ట్రీలో పెద్ద కుటుంబాలు త‌న‌ని రోడ్డుపాలు చేశాయ‌ని ఏడుస్తూ త‌న బాధ‌ను తెలియ‌జేసింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి