Viral News : భర్తను వదిలేసి మేన కొడలిని పెండ్లి చేసుకున్న మహిళ..!
Viral News : పాట్నా: బిహార్‌లో అసాధారణ వివాహాలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారాయి. ముజఫర్‌పూర్ జిల్లా భౌరా కలాన్ గ్రామంలో ఓ మహిళ తన అల్లుడితో కలిసి లేచిపోయిన సంచలన ఘటన చోటుచేసుకుంది. వారు ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి తెలియదు. వారంతా షాక్‌కు గురయ్యారు. దాంతో ఆ ఏరియాలో గాసిప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఆ మహిళ కుమార్తె పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
తాజాగా బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో మరోక రకమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. గోపాల్‌గంజ్‌లోని కుచాయికోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామానికి చెందిన మహిళకు అప్పటికే వివాహం అయ్యింది. అంతా సజావుగా సాగుతుందని భావిస్తుండగా ట్విస్ట్ చోటుచేసుకుంది.మహిళ తను కట్టుకున్న భర్తను వదిలేసి తన మేనకోడలు మెడలో మంగళసూత్రాన్ని కట్టింది. వీరిద్దరు కుటుంబ సభ్యులు, బంధువులను కాదని ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. కోడలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. అత్త భర్తను, కుటుంబాన్ని వదిలేసి మేనకోడలి కోసం వచ్చేసింది. అత్తా కోడళ్లు వివాహం చేసుకున్నారు.
Viral News : భర్తను వదిలేసి మేన కొడలిని పెండ్లి చేసుకున్న మహిళ..!
హిందూ సంప్రదాయాల ప్రకారం దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య మేనకోడలి మెడలో అత్త తాళి కట్టేసింది. అనంతరం వారిరువురు అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేశారు. ఇకపై ఒకరినొకరు విడిచిపెట్టమని ప్రమాణాలు చేసుకున్నారు. వివాహ వేడుకను ఈ జంట సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి వార్త, ఫొటోలు, వీడియో వైరల్ గా మారాయి.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.