Home » News » Viral Video Girls Hit On The Road
News

Viral Video : జుట్లు పట్టుకుని రోడ్డు మీదే కొట్టుకున్న అమ్మాయిలు.. చూస్తే షాక్

Authored By
mallesh
The Telugu News | Published on: May 21, 2022, 2:00 pm
Advertisement

Viral Video : నేటి తరం అమ్మాయిలు అసలు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. స్కూల్ వయసులోనే లవ్ ఎఫైర్లతో వార్తల్లో నిలుస్తున్నారు. తమకు నచ్చినట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సొసైటీ గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ఘటనే ఒకటి బెంగుళూరు నగరంలో చోటు చేసుకుంది. నడిరోడ్డు మీదే ఇద్దరు అమ్మాయిలు జట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ఈ అమ్మాయిలు ఇలా కొట్టుకుంటున్నా కానీ వారిని విడిపించేందుకు ఎవరూ సాహసం చేయలేదు. ఎవరు చెప్పినా కూడా వినలేని స్థితిలోకి ఆ అమ్మాయిలు జారుకున్నారు. విచక్షణ కోల్పోయి అరే మనం నలుగురిలో ఉన్నామే అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించారు. వీరి ప్రవర్తన పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఈ ఇద్దరు అమ్మాయిలు ఇలా నడిరోడ్డు మీద కొట్టుకోవడానికి వివిధ కారణాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. కారణాలు ఏవైనా కానీ వీరు ఇలా విచక్షణ కోల్పోయి కొట్టుకోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video Girls hit on the road

Advertisement

Viral Video : బాయ్ ఫ్రెండే కారణమా?

నడి రోడ్డు మీద ఇలా అమ్మాయిలు కొట్టుకున్నా, కానీ ఇటు పోలీసులు కానీ అటు స్కూలు యాజమాన్యం కానీ ఏ విధంగా స్పందించలేదు.  వీరిద్దరూ ఓ బాయ్ ఫ్రెండ్ విషయంలోనే గొడవ పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న స్ర్కీన్ షాట్లను బట్టి తెలుస్తోందని పలువురు చెబుతున్నారు. వీరు ఎందుకు కొట్టుకున్నారో కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి