Viral Video : జంతు ప్రేమికుడి మృతి.. ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకున్న వానరం
Viral Video : ఝార్ఖండ్‌లోని దేవగఢ్ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నా సింగ్‌కు మూగజీవాలంటే ఎంతో అభిమానం. జంతువులు, కోతులు, కొండముచ్చులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ.. వాటికి ఆహారం అందించేవారు. హనుమంతుడికి పరమ భక్తుడైన మున్నా సింగ్.. జంతువులను తన కుటుంబసభ్యుల్లా భావించేవాడు. మున్నాసింగ్ అనారోగ్యంతో చనిపోగా.. భౌతిక కాయాన్ని ఇంటి బయటపెట్టారు.
Viral Video : జంతు ప్రేమికుడి మృతి.. ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకున్న వానరం
ఝార్ఖండ్ మాజీ మంత్రి రణధీర్ సింగ్ కూడా మున్నా సింగ్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఎక్కడ నుంచో ఒక కొండముచ్చు వచ్చి పాడెపై ఉన్న మున్నా సింగ్ మృతదేహం వద్ద కూర్చుంది. అనంతరం భౌతిక కాయంపై కప్పి ఉన్న కాషాయ రంగు వస్త్రాన్ని పైకి ఎత్తి తదేకంగా ముఖాన్ని చూసింది. ముద్దు పెట్టి, గంటలపాటు కూర్చుంది
ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు ఆ వానరం అంతటితో ఆగకుండా మున్నా సింగ్ అంతిమ యాత్రలోనూ పాల్గొంది. జనంతో కలిసి శ్మశానానికి చేరుకుంది. దీనిని దైవ మహిమగా భావించిన స్థానికులు.. ఆ కొండముచ్చుకు నమస్కారాలు చేశారు.మున్నా సింగ్‌కు చితి పేర్చుతుంటే చాలాసేపు చూస్తూ ఆ మూగజీవి కూర్చుండిపోయింది.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.