Viral Video : కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. సజ్జనార్ షేర్ చేసిన వీడియో చూసి నోరెళ్లపెట్టిన నెటిజన్స్..!
Viral Video : ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో యువత చాలా మంది ప్రాణాలు కోల్పోతుండడం మనం చూస్తునే ఉన్నాం. లక్షలకు లక్షలు బెట్టింగులు పెడుతున్న కొందరు డబ్బులు పోగొట్టుకోవటమే కాదు.. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ఈజీగా లక్షలకు లక్షలు సంపాదించాలనే దురశాతో ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటుపడి జీవితాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కొందరు సోషలో మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ.. అమాయకులు ఆ ఉచ్చులో చిక్కుకునేలా ప్రలోభపెడుతున్నారు.అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..!!ఇది మేం చెబుతున్నది కాదు.. ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు.. కేవలం మాటలు మాత్రమే కాదు.. ఓ సంచలన వీడియోని షేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జానార్.
ఎక్స్ వేదికగా ఓ వీడియోని షేర్ చేస్తూ.. యువతకు కీలక సందేశమిచ్చారు. కొందరు వ్యక్తులు చెప్పే టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి నెట్టబడుతున్నారని అన్నారు… తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ.. ఎంతో మంది యువకుల ప్రాణాలను హరించివేస్తున్నారని, అలాంటి సంఘవిద్రోహ శక్తుల వలలో చిక్కుకోకుండా ఉండాలంటూ పిలుపునిచ్చారు.ఓ యువకుడు తక్కువ సమయంలోనే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చంనంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. ప్రజలు నమ్మే విధంగా గది నిండా రూ.500 నోట్లు వెదజల్లటంతో పాటుగా తన ఖరీదైన ఐఫోన్‌ను లైవ్‌లో పగులగొట్టి ఆ ఫోన్ కొనేందుకు కావాల్సిన డబ్బు క్షణాల్లో సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
Viral Video : కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. సజ్జనార్ షేర్ చేసిన వీడియో చూసి నోరెళ్లపెట్టిన నెటిజన్స్..!
ఓ బెట్టింగ్ యాప్‌లో 20 వేలు పెట్టుబడి పెట్టి కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షలు సంపాదిస్తాడు. ఈ వీడియోను తన ఇన్‌స్ట్ పేజీలో షేర్ చేస్తాడు.దీనిని సజ్జనార్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు అని ట్వీట్ చేశారు. ‘ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యవసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శక్తులే. యువకుల్లారా!! ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడకండి!! బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. మీ కష్టాన్ని నమ్ముకోండి. విజయం దానంతట అదే మీ దరికి చేరుతుంది.’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సజ్జనార్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.