Viral Video : అన్న,చెల్లెలు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అమ్మానాన్నల ముందు ఒకరిపై మరొకరు చాడీలు చెప్పిన ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమ కష్ట సమయాలలో వచ్చే బాధ్యత ఏ బంధానికి ఉండదేమో అనిపిస్తుంది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ మధ్య మూడో వ్యక్తి వస్తే మాత్రం ఆటాడేసుకుంటారు. చిన్నప్పుడు మాత్రమే కాదు. పెద్దయ్యాక కూడా అదే పరిస్థితి ఉంటుంది.కానీ పెళ్లి అనే తంతు ఎన్నో మార్పులు తీసుకొని వస్తుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండవలసిన పరిస్థితి ఉంటుంది.
అప్పటివరకు చెల్లికి తోడుగా ఉన్న అన్న చుట్టపు చూపుగా వచ్చి పోతాడు అనే ఆలోచన ఆ చెల్లి కంట నీరు తెప్పిస్తుంది.ప్రతిరోజు చెల్లితో గొడవ పడే క్షణాలు మళ్లీ రావేమో అని అన్నపడే బాధ గుండెల్ని పిండేస్తుంది. ఇదిగో అలాంటి వీడియోనే తల్లి గారి ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగిన తన చెల్లి ఇకపై చుట్టపు చూపుగా వస్తుంది అనే బాధ ఆ అన్నలో ఎక్కువగా కనిపిస్తుంది. బావ నా చెల్లిని బాగా చూసుకొ అని కాళ్ళ మీద పడ్డాడు.చిన్నపిల్లాడిలా గుక్క పెట్టి ఏడ్చాడు. తర్వాత చెల్లి కాళ్లపై పడి ఆమెను వదల లేదు. నువ్వు ఇక్కడే ఉండిపో అని బోరుమన్నాడు. అతని చూసిన అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
పెళ్లి కొడుకు అతన్ని హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయినా అతని కన్నీళ్లు మాత్రం ఆగలేదు. కానీ ఎంతైనా ఆడపిల్ల అంటే పుట్టిన ఇంటికి కూడా చుట్టంగా మారిపోతుంది. పెళ్లి అనే తంతుతో ఆ ఇంటికి బంధువు అవుతుంది. అత్తింటి వారిని చూసుకుంటూ బాధ్యతగా మెలుగుతుంది. అప్పగింతల తర్వాత ఆమె జీవితం మారిపోతుంది. అది మరో ప్రపంచం అందులో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అటు పుట్టింటి వారిని వదిలి వచ్చి ఆ బాధను మనసులో మోస్తూనే అత్తింట్లో చిరునవ్వుతో తిరుగుతుంది.అన్నాచెల్లెళ్లది ఇది నిస్వార్థ ప్రేమ వారు కొట్టుకున్న తిట్టుకున్న చాడీలు చెప్పకున్నా తోడుగా ఉంటారు.ఒకరి చెయ్యిని మరొకరు వదిలిపెట్టరు. కష్టసుఖాలను పంచుకుంటారు…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.