Viral Video : ఇటీవలి కాలంలో ఫోక్ సాంగ్స్‌కి మంచి డిమాండ్ ఏర్పడింది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసుపారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్ కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే ఈ మద్య కంపోజర్స్ అందరూ ఫోక్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఆడియన్స్ లో కాస్త జోష్ నింపేందుకు ఫోక్ మీద ఫోకస్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఏదైనా పాపులర్ ఫోక్ సాంగ్స్ తో హిట్ కొడుతున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు.
ఫోక్ సాంగ్ అదుర్స్.. ఫోక్ సాంగ్స్ లో బాగా రిజిస్టర్ అయి ఉన్న పాటలకి సినిమాటిక్ మ్యూజిక్ తో ఇంకాస్త ఫేమస్ చేస్తున్నారు మేకర్స్ . నాగశౌర్య హీరోగా థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన వరుడు కావలెను సినిమాలో దిగు దిగు దిగు నాగ పాట ఫోక్ ఆడియన్స్ నేకాదు.. క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందర్నీ అలరించింది. నాగశౌర్య దిగు దిగు దిగు నాగ అంటే ఈ హీరో మాత్రం మాత్రం మందులోడా, ఓరి మాయలోడా అంటూ ఫుల్ జోష్ లో పాట రిలీజ్ చేశారు. సుధీర్ బాబు, కరుణకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో ఐటమ్ సాంగ్ గా రిలీజ్ అయిన మందులోడా ఫోక్ సాంగ్..
సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యి రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ అదరగొడుతున్నాయి. తిరుగుబోతు సచ్చినోడు నా మొగుడు అనే ఫోక్ సాంగ్ ప్రస్తుతం నెట్టంట తెగ హల్‌చల్ చేస్తుంది. దాస లక్ష్మీ ఈ పాటని ఆలపించగా, మదీన్ సంగీతం అందించారు. అజయ్ ఎడిటింగ్‌తో పాటు డీఓపీగా పని చేశారు. మానుకోట ప్రసాద్, దాస లక్ష్మీ ఇందులో నటించారు. బలిజ మహేష్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. క్యూట్ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ వీడియో సాంగ్ వీక్షించి ఎంజాయ్ చేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.