Crow Video : కథలో చెప్పినట్టే నీళ్ల కోసం రాళ్లు వేసి కాకి భలే దాహం తీర్చుకుంది.. వైరల్ వీడియో !
Crow Video : చిన్నతనంలో కాకి దాహం కథ గురించి అందరికి తెలిసిందే.. దాహంతో ఉన్న కాకి నీళ్ల కోసం అడవంతా గాలిస్తుంది.. దానికి ఎక్కడా చుక్క నీరు దొరకలేదు. కానీ, అదృష్టవశాత్తు ఒక కుండలో నీళ్లు కనిపించాయి. కానీ, కుండ అడుగున ఉన్న నీటిని ఆ కాకి తాగలేకపోతుంది.. దాంతో చాకచక్యంగా ఆలోచించిన ఆ కాకి..ఒక్కో రాయి కుండలో వేయడం మొదలుపెట్టింది.
Crow Video : కథలో చెప్పినట్టే నీళ్ల కోసం రాళ్లు వేసి కాకి భలే దాహం తీర్చుకుంది.. వైరల్ వీడియో !
Crow Video కథలో కాకి ఇదేనా ?
చివరికి.. రాళ్ల బరువుతో కుండలో నీరు పైకి వచ్చాయి. అప్పుడు ఇక హాయిగా నీటిని తాగి కాకి తన దాహాన్ని తీర్చుకుంది. కాకుల తెలివి గురించిన ఈ నీతి కథ చిన్నతనం నుంచి పిల్లలకు చెబుతూ ఉంటారు. అయితే ఇది కథ..ఈ కథ సజీవంగా మన ముందు కనిపిస్తే.. ఎలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కాకి దాహం కథ గుర్తు తెస్తుంది.
ఓన్‌స్టాగ్రామ్ పేజీలో ‘స్కూల్ లో చెప్పిన పాఠంలో కాకి దొరికింది’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు. వీడియోలో దాహంతో ఉన్న కాకి బాటిల్‌లో రాళ్లను వేడి నీళ్లు పైకి రాగానే కాకి నీళ్లు తాగింది.నేను నిజ జీవితంలో పాఠశాల పాఠాల్లో చదివిన కాకిని చివరకు నాకు చూపించినందుకు ధన్యవాదాలు” అని అన్నారు. మరో వినియోగదారు “మనం పాఠంలో చదివిన ఆ కాకి ఇంకా బతికే ఉందా?” అంటూ ఫన్నీ కామెంట్ రాశారు.
