Home » Andhra Pradesh » A Women Attack By Young Man
andhra pradesh

Women : తనతో ఆ ప‌నికి రావట్లేదని యువకుడిపై దాడి చేసిన ఆంటీ .. !!

Authored By
aruna
The Telugu News | Published on: October 7, 2023, 6:00 pm
Advertisement

Women : ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఒకవైపు టెక్నాలజీతో ప్రపంచం దూసుకు వెళుతుంటే మరోవైపు జనాలు చెడు దారుల వైపు ఎక్కువగా వెళుతున్నారు. మరీ ఇప్పుడు కొందరు వావి వరుసలు లేకుండా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబాలకు దూరం అవుతూ వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గుంటూరు కి చెందిన 20 ఏళ్ల యువకుడు, 45 ఏళ్ల ఆంటీ వలలో పడ్డాడు. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. అయితే మనస్పర్ధలు కారణంగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. దీంతో బరితెగించిన ఆంటీ యువకుడు తన వద్దకు రావడం లేదని యాసిడ్ దాడి చేసింది.

Advertisement

గుంటూరు కు చెందిన రాధ తన భర్త చనిపోయాడో లేక ఈమెను తట్టుకోలేక పోయాడో కానీ ఆ ఆంటీ మాత్రం భర్త లేడు అన్న విషయం పక్కన పెట్టి 20 ఏళ్ల వెంకటేష్ కు వల విసిరింది. వయసులో ఉన్న వెంకటేష్ టైం పాస్ అవుతుందని ఆంటీని తగులుకున్నాడు. ఇంకేముంది ఇద్దరు స్వర్గ సుఖాలలో తేలి పోతున్నారు. అయితే కొన్ని రోజులకు వెంకటేష్ కు ఆంటీ తనను వదిలేలా లేదని అర్థం అయినట్లుంది. ఆమెతో వుంటే భవిష్యత్తు ఎటు పోతుందో అని ఆలోచించి ఆమెను వదులుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమెను దూరం పెట్టేసాడు. ఇది భరించలేకపోయిన ఆంటీ యువకుడితో గొడవ పడింది.

A women attack by young man

Advertisement

ఈ గొడవ కూడా మంచిదే కదా అని ఇదే అవకాశం గా భావించి వెంకటేష్ ఆమె ఇంటికి రావడం మానేశాడు. అయితే వెంకటేష్ రాకపోవడంతో రాధ భరించలేకపోయింది. తన వద్దకు రావడం లేదని తీవ్ర ఆగ్రహానికి గురైంది. తనకు దక్కని వెంకటేశ్ ఎవరికి దక్కకూడదని భావించింది. ఈ క్రమంలోనే టైం చూసి అతడి పై యాసిడ్ దాడి చేసింది. యాసిడ్ పూర్తిగా పడి ఉంటే అతడు ప్రాణాలు పోయేవని వైద్యులు అన్నారు. అయితే ఇంతలా బరితెగించిన ఆ మహిళపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి