
Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ ..నెక్స్ట్ ?
Rajini : మాజీ మంత్రి విడదల రజినికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె మరిది విడదల గోపీనాథ్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద ఉన్న శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనపై నమోదైన కేసులో ఈ అరెస్టు జరిగింది. ఈ కేసులో రజినిని ప్రధాన నిందితురాలిగా (ఏ1) చేర్చిన ఏసీబీ, గోపినాథ్‌ను (ఏ3), ఓ ఐపీఎస్ అధికారిని (ఏ2), అలాగే ఆమె పీఏ రామకృష్ణను (ఏ4) చేర్చారు.
Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ ..నెక్స్ట్ ?
కేవలం ఒకటే కాదు, గత కొన్ని నెలలుగా మాజీ మంత్రిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. పసుమర్రు గ్రామంలోని జగనన్న కాలనీ స్థలాల సేకరణలో రైతుల నుంచి కమీషన్ పేరిట డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో మరో కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలపై తీరైన స్పందన రాకపోయినా, ఆరోపణల మధ్య రజినీ డబ్బులు తిరిగి ఇచ్చేశారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఐటీడీపీ నేత పిల్లికోటి అనే వ్యక్తి, తనను వేధించారంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రజినిపై పెట్టడం చర్చనీయాంశమైంది.
ఈ కేసుల నేపథ్యంలో ఇది కేవలం రాజకీయ కక్షేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ నేతలు ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన పేరుతో విపక్ష నేతలపై అకారణంగా కేసులు పెట్టడం ద్వారా వారిని వేధించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. పాలక పక్షం తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ ప్రేరణతోనే ఈ చర్యలు తీసుకుంటోందని విమర్శిస్తున్నారు.
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
This website uses cookies.