Aadhaar Pan : ఆధార్, పాన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిసెంబర్ 31 వరకే గడువు

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: October 26, 2026, 3:28 pm
  •  Aadhaar Pan : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. ఆధార్, పాన్ కార్డు వివరాల ధృవీకరణకు గడువు నిర్ణయిస్తూ అన్ని శాఖలకు…

Aadhaar Pan : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. ఆధార్, పాన్ కార్డు వివరాల ధృవీకరణకు గడువు నిర్ణయిస్తూ అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పాన్, ఆధార్ వివరాల వెరిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో అప్‌డేట్ చేయాలని అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల రికార్డులను మరింత కచ్చితంగా నిర్వహించడంతో పాటు పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్ చెల్లింపుల సమయంలో ఎదురవుతున్న జాప్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా మెమో కూడా జారీ చేసింది.

Aadhaar Pan : ఆధార్, పాన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిసెంబర్ 31 వరకే గడువు

Aadhaar Pan : ఆధార్, పాన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిసెంబర్ 31 వరకే గడువు

Aadhaar Pan డిసెంబర్ 31లోగా ఆధార్, పాన్ వెరిఫికేషన్ పూర్తి

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆధార్, పాన్ కార్డు వివరాలను సేకరించి ధృవీకరించాలని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌ఓడీలకు ప్రభుత్వం సూచించింది. సేకరించిన వివరాలను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ సిస్టమ్‌లోని పెన్షన్ మాడ్యూల్‌లో అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి పాన్, ఆధార్ కార్డుల కాపీలను సేకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రెజరీ, అకౌంట్స్ శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. పెన్షన్ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని, తమకు రావాల్సిన బకాయిలు సకాలంలో అందడం లేదని పెన్షనర్లు ఇటీవల ఆందోళనలు కూడా చేపట్టారు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి జాప్యాలకు అవకాశం లేకుండా ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అకౌంట్స్, ట్రెజరీ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రికార్డుల్లోని వివరాలను కచ్చితంగా నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తే పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియలో ఆలస్యాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగులు, పెన్షనర్ల ఆధార్, పాన్ వివరాలను సేకరించి అధికారిక రికార్డులతో సరిపోల్చాలని సూచించింది.ఈ ధృవీకరణ ప్రక్రియ పెన్షనర్ల గుర్తింపునకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా అనర్హంగా లేదా అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించేందుకు ఈ వివరాలు సహాయపడతాయని తెలిపింది. మరణించిన పెన్షనర్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, వాటిని సరిచేసేందుకు కూడా ఆధార్, పాన్ ధృవీకరణ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా మెమో జారీ చేసింది.

Aadhaar Pan రిటైర్ కానున్న వేలాది ఉద్యోగులు.. రికార్డులపై ప్రత్యేక దృష్టి

ఈ నిర్ణయం వెనుక మరో కీలక అంశం కూడా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో 9,719 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే ఏడాది మరో 9,443 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి సర్వీస్ రికార్డులు, వ్యక్తిగత వివరాలు ముందుగానే కచ్చితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ కారణంగానే ఆధార్, పాన్ ధృవీకరణ ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ పనిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించింది.

ఉద్యోగులు, పెన్షనర్లు సమర్పించిన ఆధార్, పాన్ వివరాలను కేవలం నమోదు చేయడంతో సరిపెట్టకుండా, వాటిని సర్వీస్ రికార్డులు, సంబంధిత సహాయక పత్రాలతో సరిపోల్చి పరిశీలించాలని ప్రభుత్వం పేర్కొంది. పేరు, ఇతర వ్యక్తిగత వివరాలు లేదా రికార్డుల్లో ఏవైనా తప్పులు, వ్యత్యాసాలు గుర్తిస్తే వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.మొత్తంగా ఉద్యోగులు, పెన్షనర్ల రికార్డులను క్రమబద్ధీకరించడం, పెన్షన్‌దారుల గుర్తింపును నిర్ధారించడం, అక్రమ పెన్షన్లను గుర్తించడం, మరణించిన పెన్షనర్ల రికార్డులను పరిశీలించడం, పదవీ విరమణ ప్రయోజనాలు మరియు పెన్షన్ చెల్లింపుల్లో జాప్యాన్ని తగ్గించడం ఈ ప్రక్రియలో కీలక అంశాలుగా ఉన్నాయి. అందుకే ఆధార్, పాన్ ధృవీకరణను ప్రాధాన్యతతో చేపట్టి డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని సంబంధిత శాఖలకు స్పష్టం చేసింది. Telangana Employees, Telangana Pensioners, Aadhaar PAN Verification, Telangana Government, Pension Latest Update

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp