Home » Andhra Pradesh » Analysts Say Ys Jagan Will Be The Next Ap Cm
andhra pradesh

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 7, 2025, 8:00 pm
Advertisement

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పు సంభవించడం సహజమేనని అభిప్రాయపడుతున్నారు. అదే తీరులో చూస్తే 2029 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కూటమి సర్కారు అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాల్లో జాప్యం, సమర్థవంతమైన పాలనలో లోపాలు ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయని సోషల్ మీడియాలో Social Media  కామెంట్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ Ysrcp తిరిగి విజయం సాధించడం పక్క అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Ys Jagan : 2029 లో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే అంటున్న విశ్లేషకులు

వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజధాని అంశాన్ని కొత్తగా పునరాలోచన చేయబోతోందని సమాచారం. మళ్లీ మూడు రాజధానుల బాటలో కాకుండా, మంగళగిరిని ప్రధాన రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరి, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి 40 లక్షల జనాభాతో రాజధాని నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇది రైతులకు, భూ యజమానులకు న్యాయం చేసే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో రాజధాని విషయంలో ఎదురైన విమర్శలకు ముగింపు పలకేలా జగన్ కొత్త వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

వైసీపీ భావించే అభివృద్ధి ప్రణాళికలు మంగళగిరికి మాత్రమే కాకుండా చిలకలూరిపేట, తెనాలి నియోజకవర్గాల వరకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ సీఎం అవ్వడం తన లక్ష్యమని జగన్ లోతైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా వైసీపీ వ్యవహరించనుందన్నది రాజకీయ విశ్లేషణ. ప్రజలకు ప్రభుత్వంపై తిరిగి విశ్వాసం కలిగేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం వైసీపీకి ఉందని సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి