Home » Andhra Pradesh » Ap El Nino Crop Impact Chandrababu Review
andhra pradesh

AP El Nino : ఏపీపై ఎల్ నినో పంజా.. తీవ్ర కరువు తప్పదా? చంద్రబాబు అత్యవసర ఆదేశాలు..!

AP El Nino : ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో (El Nino) ప్రభావం వ్యవసాయ రంగంపై ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2.44 లక్షల హెక్టార్లలో పంటలు…
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 22, 2026, 4:25 pm
Advertisement

AP El Nino : ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో (El Nino) ప్రభావం వ్యవసాయ రంగంపై ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2.44 లక్షల హెక్టార్లలో పంటలు ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు కొన్ని మీడియా కథనాల్లో వ్యక్తమవుతున్న వేళ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు chandrababu naidu సెప్టెంబర్ 20న అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం, ముందస్తు జాగ్రత్తలు, అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్‌పై చర్చించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

AP El Nino : ఏపీపై ఎల్ నినో పంజా.. తీవ్ర కరువు తప్పదా? చంద్రబాబు అత్యవసర ఆదేశాలు..!

AP El Nino రైతులను ఆదుకోవాలి.. నిత్యావసర ధరలు అదుపులో ఉండాలి

వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, రైతు సేవా కేంద్రాల (RSK) సిబ్బందితో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవడం, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచడం ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైరిస్క్ ఆర్ఎస్కే పరిధిలోని హార్టికల్చర్ పంటలను రక్షించేందుకు కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించాలని చెప్పారు. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై దృష్టి పెట్టి, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

Advertisement

Also Read : Vijayasai Reddy : రెడ్ల ని చీల్చడానికే విజయసాయిరెడ్డి వచ్చారా..?

గ్రామాల్లో అవగాహన.. ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి

అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని సీఎం సూచించారు. స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటలు సాగు చేసేలా రైతులకు మార్గనిర్దేశం చేయాలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటలు, వాటి ప్రయోజనాలను వివరించాలని, సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి