Bigg Boss Telugu 10 : నరేష్ నిర్ణయంపై కంటెస్టెంట్ల ఫైర్.. నాగార్జున క్లాస్ ఇస్తారా? వీకెండ్‌లో ఏం జరగబోతోంది?
Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ సందడి కొనసాగుతోంది. అయితే కుటుంబ సభ్యులను కలుసుకునే ఆనందం కంటే హౌస్‌లో జరుగుతున్న గొడవలు…
Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ సందడి కొనసాగుతోంది. అయితే కుటుంబ సభ్యులను కలుసుకునే ఆనందం కంటే హౌస్‌లో జరుగుతున్న గొడవలు, టాస్కుల వివాదాలే ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ నరేష్ వ్యవహారశైలి తాజాగా హౌస్‌లో పెద్ద వివాదానికి కారణమైంది. ముఖేష్ ఆడిన టాస్క్‌లో బ్రిక్స్ ఐదు సెకన్ల పాటు బ్యాలెన్స్‌గా ఉండాల్సి ఉండగా, నాలుగో సెకనులోనే అవి కిందపడిపోయాయని మిగతా కంటెస్టెంట్లు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ నరేష్ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ తెలుగు 10 ఇప్పటికే పదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ కీలకమైన సమయంలో ఫ్యామిలీ వీక్ టాస్కులు జరుగుతుండటంతో హౌస్‌లో భావోద్వేగాలతో పాటు వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కంటెస్టెంట్ల ఆటతీరు, ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలకు కారణమవుతున్నాయి. ఇక ప్రతి వారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఇచ్చే క్లాసులు, కంటెస్టెంట్ల తప్పులపై ఆయన చేసే వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.
అయితే ఇప్పటివరకు హౌస్‌లో చాలామంది కంటెస్టెంట్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ ఇచ్చారు. కానీ జబర్దస్త్ నరేష్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇతరులకు విమర్శలు ఎదురైన సందర్భాల్లో కూడా నరేష్‌ను నాగార్జున ప్రశంసించడమే ఎక్కువగా కనిపించిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అలాంటి నరేష్ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ టాస్క్‌లో తీసుకున్న నిర్ణయంతో చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడింది.
Bigg Boss Telugu 10 : నరేష్ నిర్ణయంపై కంటెస్టెంట్ల ఫైర్.. నాగార్జున క్లాస్ ఇస్తారా? వీకెండ్‌లో ఏం జరగబోతోంది?
Bigg Boss Telugu 10 ముఖేష్ టాస్క్‌లో అసలేం జరిగింది? నాలుగో సెకనుకే కిందపడ్డ బ్రిక్స్!
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ముఖేష్, అమన్, వర్షిణి, రామకృష్ణలకు బిగ్‌బాస్ ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో జబర్దస్త్ నరేష్‌ను సంచాలకుడిగా నియమించారు. టాస్క్ నిబంధనల ప్రకారం హౌస్ ఆకారంలో ఉన్న బ్రిక్స్‌ను ఒకదానిపై మరొకటి జాగ్రత్తగా పేర్చాలి. ఆ తర్వాత సంచాలకుడిగా ఉన్న నరేష్ ఐదు సెకన్ల పాటు కౌంట్ చేయాలి. ఆ ఐదు సెకన్ల సమయంలో బ్రిక్స్ కిందపడకుండా బ్యాలెన్స్‌గా ఉంటేనే సదరు కంటెస్టెంట్ విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌లో ముఖేష్ తన వంతు ప్రయత్నం బాగానే చేశాడు. అయితే బ్రిక్స్‌ను బ్యాలెన్స్ చేసే సమయంలో నరేష్ కౌంటింగ్ ప్రారంభించాడు. అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో, నరేష్ నాలుగో సెకను లెక్కపెడుతున్నప్పుడే బ్రిక్స్ ఒక్కసారిగా కిందపడిపోయాయి. దీంతో ముఖేష్ టాస్క్ నిబంధనల ప్రకారం గెలిచాడా లేదా అన్న విషయంలో హౌస్‌లో వివాదం మొదలైంది. అక్కడున్న మిగతా కంటెస్టెంట్లు బ్రిక్స్ నాలుగో సెకనులోనే పడిపోయాయని స్పష్టంగా అభ్యంతరం తెలిపారు. ఐదు సెకన్లు పూర్తయ్యే వరకు అవి నిలబడలేదని వాదించారు. కానీ సంచాలకుడిగా ఉన్న నరేష్ మాత్రం వారి అభిప్రాయాన్ని అంగీకరించలేదు. తన నిర్ణయమే సరైందంటూ వాదించడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.
Also Read : Team India : శత్రుదేశ పర్యటనకు టీమిండియా..? 2027 జనవరిలో ఆరు మ్యాచ్‌లు..!
నాగార్జున ముందు ఛాలెంజ్.. ఈసారి నరేష్‌కు తప్పదా క్లాస్?
మిగతా హౌస్‌మేట్స్ ఎంతగా వ్యతిరేకించినా జబర్దస్త్ నరేష్ మాత్రం తన పట్టును వీడలేదు. అంతేకాదు, తన నిర్ణయం తప్పని తేలితే శిక్షను స్వీకరించడానికి సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శనివారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి తన తప్పును నిరూపిస్తే శిక్ష అనుభవిస్తానని స్పష్టం చేశాడు.తన మాటల్లోనే చెప్పాలంటే.. “నేను ఏమైనా తప్పు చేసి ఉంటే శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున సర్ వచ్చి నన్ను తప్పుపడతారు. అప్పుడు నేను శిక్ష అనుభవిస్తా. ఒకవేళ నాదే తప్పు అని తేలితే నా ఫ్యామిలీని కలుసుకునే అవకాశాన్ని కూడా వదులుకుంటా.. ఇది నా ఛాలెంజ్” అంటూ నరేష్ గట్టిగా సమాధానమిచ్చాడు.ఇప్పటివరకు నాగార్జున నుంచి ఎక్కువగా ప్రశంసలు అందుకుంటూ వచ్చిన నరేష్‌కు ఈసారి మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాస్క్‌లో జరిగిన పొరపాటుపై నాగార్జున నిజంగానే నిలదీస్తారా? లేక నరేష్ ఇచ్చిన వివరణను అంగీకరిస్తారా? తన ఛాలెంజ్‌కు తగ్గట్టుగా నరేష్ శిక్షను స్వీకరించాల్సి వస్తుందా? అన్నది ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వివాదంపై వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఇచ్చే తీర్పు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.