AP Good News : వైఎస్సార్సీపీ పాలనలో మద్యం పేరుతో అందినకాడికి దోచేశారన్నది తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు మద్యం విధానంలో కొనసాగించిన దోపిడీకి వాసుదేవరెడ్డే కళ్లు, చెవులు సహా అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు రావడం మనం చూశాం. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టగానే ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్‌గా ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని నియమించుకున్నారు. నాలుగున్నరేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగి వైఎస్సార్సీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటు చేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారుచేసే ‘జే బ్రాండ్లు’ మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో లభ్యమయ్యేలా చేసింది ఈయనేనని టీడీపీ గుర్తించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా మొదలుకుని విక్రయాల వరకూ అన్నింటా వ్యవస్థీకృతంగా సాగించిన ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న నేతలు, పాత్రధారులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ కీలక నాయకుల బినామీలు, సన్నిహితులుగా పేరొందిన వారి నివాసాలు, కార్యాలయాల్లో, అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల్లో ఎక్కడ సోదాలు చేసినా ఈ కుంభకోణం డొంక బయటపడుతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం రావడంతో నాణ్యత గల మందు సరఫరా చేయాలని చూస్తున్నారట. ఎన్నికల ప్రచారంలోను ఆయన ఈ మాట చెప్పారు.
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలని వేలం ద్వారా ప్రైవేట్ వ్యక్తులని ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. మద్యం అమ్మకాలు ప్రభుత్వం పని కాదని, నాసికరం మందు అమ్మకుండా చూడడమే ప్రభుత్వం పని అని చంద్రబాబు చూస్తున్నారట. ఈ క్రమంలోనే ప్రైవేట్ వ్యక్తులకి మద్యం దుకాణాలని అప్పగించే ఆలోచన చేస్తున్నారట. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు కసరత్తులు కూడా మొదలు పెట్టారని టాక్ నడుస్తుంది. వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే జూన్ 12వరకు ఆగాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.