IND vs NZ : రికార్డులు బద్దలుకొట్టడానికే పుట్టావా మావా.. ఒకే ఇన్నింగ్స్‌తో 7 రికార్డులు బ్రేక్..!
IND vs NZ : విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మరోసారి తన అసలైన జోరు చూపించాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో 51 బంతుల్లో 74 పరుగులు చేసి…
IND vs NZ : విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మరోసారి తన అసలైన జోరు చూపించాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో 51 బంతుల్లో 74 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా అంతరాయాలు ఎదురైన ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ క్రమంలో వన్డే కెరీర్‌లో 80వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు, ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఛేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల వన్డే పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌పై రికార్డులు, విజయాల్లో 50కి పైగా పరుగులు చేసిన సందర్భాలు, SENA జట్లపై సాధించిన ఘనతలు.. ఇలా కోహ్లీ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు.
IND vs NZ : రికార్డులు బద్దలుకొట్టడానికే పుట్టావా మావా.. ఒకే ఇన్నింగ్స్‌తో 7 రికార్డులు బ్రేక్..!
IND vs NZ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. ఛేజింగ్‌లో కోహ్లీ టాప్!
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన అత్యంత కీలకమైన ఘనత వన్డేల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం. ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ వన్డే ఛేజింగ్‌లలో 8,720 పరుగులు సాధించగా, న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం కోహ్లీ ఖాతాలో 8,727 పరుగులు చేరాయి. దీంతో సచిన్‌ను వెనక్కి నెట్టి కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన SENA జట్లపై అంతర్జాతీయ క్రికెట్‌లో 50కి పైగా పరుగులు చేసిన సందర్భాల్లోనూ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ జట్లపై ఇప్పటివరకు 134 సార్లు 50కి పైగా స్కోర్లు నమోదు చేసి అగ్రస్థానానికి చేరాడు. సచిన్ టెండూల్కర్ 133 సార్లు ఈ ఘనత సాధించగా, కోహ్లీ ఆయనను అధిగమించాడు. వన్డేల్లో భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధికసార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఈ విభాగంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో సమానంగా నిలిచాడు. ఇద్దరూ చెరో 94 సార్లు ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్, పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌తో కలిసి కోహ్లీ 27 సార్లతో సంయుక్తంగా మొదటి స్థానాన్ని పంచుకుంటున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 26 సార్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Also Read : Bigg Boss Telugu 10 : టాప్ కంటెస్టెంట్లకు షాక్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?
నంబర్ 3లో 13 వేల పరుగులు.. న్యూజిలాండ్‌పై పాంటింగ్‌తో సమంగా కోహ్లీ!
వన్డే క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు ఈ ఘనతకు చేరుకోవడానికి అతడికి మరో 12 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న తర్వాత ఆ మైలురాయిని అందుకున్నాడు. ఈ స్థానంలో కోహ్లీ ఇప్పటివరకు 13 వేల పరుగులకు పైగా సాధించాడు. అతడి తర్వాత రికీ పాంటింగ్ 12,662 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ కోహ్లీ రికీ పాంటింగ్‌తో సమానంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌పై వన్డేల్లో కోహ్లీకి 1,897 పరుగులు ఉండగా, ఈ ఇన్నింగ్స్‌లో చేసిన 74 పరుగులతో మొత్తం 1,971కు చేరాయి. పాంటింగ్ కూడా న్యూజిలాండ్‌పై వన్డేల్లో 1,971 పరుగులే సాధించాడు. దీంతో ఈ విభాగంలో ఇద్దరూ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.న్యూజిలాండ్ గడ్డపై భారత ఆటగాళ్లు సాధించిన వన్డే పరుగుల జాబితాలోనూ కోహ్లీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 74 పరుగులు చేయడంతో అక్కడ అతడి మొత్తం వన్డే పరుగులు 670కి చేరాయి. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ సాధించిన 598 పరుగుల రికార్డును అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 821 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇలా ఒకే మ్యాచ్‌లో 80వ వన్డే అర్ధ సెంచరీ, ఛేజింగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు, నంబర్ 3లో 13 వేల పరుగుల మైలురాయి, న్యూజిలాండ్‌పై పలు ఘనతలు.. ఇలా విరాట్ కోహ్లీ మరోసారి తన రికార్డుల వేటను కొనసాగించాడు. వయసు పెరుగుతున్నా ఆటలో వేగం, పరుగుల దాహం ఏమాత్రం తగ్గలేదని ఈ ఇన్నింగ్స్‌తో అభిమానులకు మరోసారి చూపించాడు. Virat Kohli , IND vs NZ 1st ODI, Virat Kohli Records, India vs New Zealand 2026, Sachin Tendulkar Record







