Categories: andhra pradeshNews

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి రాజీనామాకు కార‌ణాలు ఇవేనా ?

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి Vijayasai Reddy  రాజ‌కీయాల నుంచి స‌డ‌న్‌గా త‌ప్పుకోవ‌డానికి, ఏకంగా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా వ‌దులుకోవ‌డానికి కారణాలు ఏమై ఉంటాయ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీని వెనుక వైసిపి వ్యూహం ఉన్నట్లు అనుమానాలు ప‌లువురు విళ్లేషిస్తుండ‌గా, అంతకుమించి విజయసాయి రెడ్డికి వైసీపీలో చాలా అవమానాలు జరిగినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ పార్టీ Ysrcp Party  ఏర్పాటు నుంచి, జ‌గ‌న్‌తో  Ys Jaganపాటు కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ల‌డం దాకా వైఎస్ కుటుంబం వెన్నంటే ఉన్నారు విజ‌య‌సాయిరెడ్డి Vijayasai Reddy . అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీని విడ‌డం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో విభాగం విజయసాయిరెడ్డి నుండి దూరం అవుతూ వచ్చింది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి Sajjala Ramakrishna reddy ఎంట్రీ తర్వాత సీన్ మారింద‌ని అంతా అంటుంటారు. గ‌డిచిన ఎన్నికలకు ముందు Vijayasai Reddy విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్‌చార్జీ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో వైవి సుబ్బారెడ్డిని YV Subbareddy నియమించారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఉత్తరాంధ్రకు Vijayasai Reddy విజయసాయిరెడ్డిని పంపించారు. కానీ అక్కడ ఆయనకు అడుగడుగునా అవమానాలు ఎదురైనట్లు తెలుస్తోంది….

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి రాజీనామాకు కార‌ణాలు ఇవేనా ?

Vijayasai Reddy ఉత్తరాంధ్రలో వ‌రుస‌ పరిణామాలు

ఉత్తరాంధ్రలో ఇటీవల బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ కుటుంబ పెత్తనం పెరిగింది. ఎన్నికల్లో బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆమె ఓట‌మిపాల‌య్యారు. అనంతరం బొత్స సత్యనారాయణను విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇటీవల బొత్స మేనల్లుడు శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. చోడవరంలో కరణం ధర్మశ్రీని తప్పించారు. చోడవరం బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఇచ్చారు. ఈ ప‌రిణామాల‌న్నింటిలో విజ‌య‌సాయిరెడ్డికి కనీస సమాచారం ఇవ్వ‌న‌ట్లుగా స‌మాచారం. ఉత్తరాంధ్రలో ఐపాక్ టీమ్‌ సైతం విజయసాయిరెడ్డిని లెక్కలోకి తీసుకోక‌పోవ‌డం కూడా విజయసాయిరెడ్డిలో అసంతృప్తికి కారణంగా చెప్పుకుంటున్నారు.

Vijayasai Reddy చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి నుంచి సవాళ్లు ?

విజ‌య‌సాయిరెడ్డి మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి అనేక రకాల సవాళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ట్లుగా స‌మాచారం. పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయసాయి రెడ్డి వద్ద ఉన్న అనుబంధ విభాగాల బాధ్యతలను భాస్కర్ రెడ్డికి కట్టబెట్టారు. దాంతో ఆయ‌న తీవ్ర మనస్థాపానికి గురైన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. విజయసాయిరెడ్డి ఇప్పటికే సజ్జల రూపంలో ఇబ్బందులు పడ్డారని, వై వి సుబ్బారెడ్డి సైతం ఆధిపత్యం ప్రదర్శించిన‌ట్లు, ఇప్పుడు తాజాగా ఆ స‌ర‌స‌న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరిన‌ట్లుగా అంతా చ‌ర్చించుకునేవారు. ఉత్తరాంధ్రలో బొత్స తో పాటు ఐపాక్, పార్టీ కేంద్ర కార్యాలయంలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేది ఒక‌రైతే పెత్త‌నం మ‌రొక‌రిదిగా మార‌డంతో విజయసాయిరెడ్డి సహించలేకపోయిన‌ట్లు అంతా అనుకుంటారు. ఈ కార‌ణాలు సైతం ఆయ‌న పార్టీకి రాజీనామా చేసేలా పురిగొల్పిన‌ట్లు స‌మాచారం.

Vijayasai Reddy వైసీపీ YCP తొలి స్పందన ఏమిటి?

విజయ సాయి రెడ్డి పదవీ విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన ప్ర‌తిస్పంద‌న‌ విషయానికి వస్తే, వారు ఒక విచిత్రమైన వైఖరిని కలిగి ఉన్నారు. నెల్లూరు వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ.. విజయ సాయి రెడ్డి ఎల్లప్పుడూ పార్టీకి సమగ్ర నాయకుడని, అది ఎలా ఉన్నా అలాగే కొనసాగుతుందని అన్నారు. “సాయి రెడ్డి గారు అన్ని కష్టాల్లో జగన్ వెంటే ఉన్నారు. ఈ సమయంలో ఆయన రిటైర్మెంట్‌ను మేము అర్థం చేసుకోలేకపోతున్నాము, కానీ విచారకరంగా పరిస్థితి అలాగే ఉందన్నారు. మరో నాయ‌కుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ “బహుశా సాయి రెడ్డి బాహ్య ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. వ్యాపారాలు నిర్వహించే మరియు రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు ఎల్లప్పుడూ ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago