Home » Andhra Pradesh » Av Subbareddys Daughter Warning To Akhilapriya Video Viral
andhra pradesh

Bhuma Akhila Priya : అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి కూతురు వార్నింగ్… వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 18, 2023, 6:00 pm
Advertisement

Bhuma Akhila Priya : మంగళవారం లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లాలో ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి రోజే నంద్యాల జిల్లాలో లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ వర్గీయుల మధ్య భారీ గొడవ చోటు చేసుకుంది. ఏవీ సుబ్బారెడ్డి పై అఖిలప్రియ వర్గీయులు దాడి చేయడం జరిగింది. ఈ పరిణామంతో అఖిల ప్రియ మరియు ఆమె భర్త భార్గవరామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డి దాడి ఘటన విషయంలో కూతురు జస్వంతి రెడ్డి స్పందించింది.

Advertisement

దాడిని ఖండిస్తూ అఖిలప్రియకు వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. తండ్రి లాంటి వ్యక్తిపై దాడి చేయించడమే కాకుండా… తనపై హత్యాయత్నం చేశారంట తప్పుడు వ్యాఖ్యలు అఖిల ప్రియ చేస్తుందని జశ్వంతిరెడ్డి మండిపడింది. గొడవ ఫుటేజ్ మొత్తం చూస్తే.. ఎవరు గొడవకు దిగారో తప్పు ఎవరిదో తెలిసిపోతుంది అని పేర్కొంది. అఖిల ప్రియ క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుందని జస్వంతిరెడ్డి మండిపడింది.

Bhuma Akhila Priya

Advertisement

వచ్చే ఎన్నికలలో టీడీపీ హాయ్ కమాండ్ ఆదేశిస్తే తాను కానీ తన తండ్రి గాని పోటీ చేస్తామని ఏవి సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలా కాదని అఖిల ప్రియకు టికెట్ ఇస్తే నంద్యాల, ఆళ్లగడ్డలో ఎక్కడి నుంచి పోటీ చేసిన ఆమె పతనం కోసం తాము పని చేస్తామని హెచ్చరించింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి