Karthika Deepam 2 Today Episode October 16th : జ్యోత్స్న సేఫ్.. మాలిని వెనుక అసలు ట్విస్ట్ ఇదే!
Karthika Deepam 2 Today Episode October 16th : కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. జ్యోత్స్న…
Karthika Deepam 2 Today Episode October 16th : కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. జ్యోత్స్న కనిపించకపోవడంతో సుమిత్ర కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. మరోవైపు, జ్యోత్స్న కోసం వెతుకుతున్న సూరజ్‌కు యాక్సిడెంట్లో చనిపోయిన ఓ యువతి గురించి పోలీసుల నుంచి సమాచారం రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. అయితే, మార్చురీలో ఉన్న మృతదేహం జ్యోత్స్నది కాదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో జ్యోత్స్న ఆఫీసులో ప్రత్యక్షమవుతుంది. అసలు ఆమె మూడు రోజుల పాటు ఎక్కడికి వెళ్లింది? ఆమె కనిపించకుండా పోవడం వెనుక మాలిని పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నల మధ్య ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
Karthika Deepam 2 Today Episode October 16th : జ్యోత్స్న సేఫ్.. మాలిని వెనుక అసలు ట్విస్ట్ ఇదే!
Karthika Deepam 2 Today Episode October 16th పోలీసులతో మాలిని ఇంటికి సుమిత్ర.. సూరజ్‌కు కొత్త సమస్య
జ్యోత్స్న కనిపించకపోవడంతో సుమిత్ర కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని పోలీసులతో కలిసి మాలిని ఇంటికి వెళ్తుంది. అక్కడ సూరజ్‌ను నిలదీస్తూ, తన కూతురిని ఏం చేశారని ప్రశ్నిస్తుంది. అయితే, సూరజ్ మాత్రం తాను కూడా గత రెండు రోజులుగా జ్యోత్స్నకు ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు పంపిస్తూ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నానని చెబుతాడు. ఈ మాటలు విన్న మాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు, సరైన ఆధారాలు లేకుండా తన తల్లిని అరెస్ట్ చేయాలని చూస్తే ఊరుకోనని సూరజ్ పోలీసులకు హెచ్చరిక జారీ చేస్తాడు. దీంతో పోలీసులు, శివన్నారాయణ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. జ్యోత్స్న కనిపించకపోవడానికి తమ కుటుంబమే కారణమనే నింద పడిందని దక్షిణామూర్తి బాధపడతాడు. ఆ అపవాదును తొలగించుకోవాలని నిర్ణయించుకుని సూరజ్‌ను వెంటబెట్టుకుని కార్తీక్ ఇంటికి వెళ్తాడు. గుమ్మం దగ్గర దక్షిణామూర్తిని చూసిన సుమిత్ర తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే, దక్షిణామూర్తి మాత్రం కంటతడి పెట్టుకుంటూ ఆమె కాళ్లు పట్టుకుంటానని, తన మనవరాలు జ్యోత్స్న ఎక్కడుందో చెప్పాలని వేడుకుంటాడు. జ్యోత్స్న ఆచూకీ తనకు తెలియదని, ఆమె తిరిగి వచ్చి తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేవరకు అక్కడి నుంచి వెళ్లనని స్పష్టం చేస్తాడు.
Karthika Deepam 2 Today Episode October 16th యాక్సిడెంట్లో చనిపోయింది జ్యోత్స్నేనా? సూరజ్‌కు పోలీసుల ఫోన్
మరోవైపు, జ్యోత్స్న ఆచూకీ తెలియక కార్తీక్, దీప, సూరజ్ తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. ఇంతలో సూరజ్‌కు పోలీసుల నుంచి ఫోన్ వస్తుంది. రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోయిందని, ఆమె మృతదేహం మార్చురీలో ఉందని, గుర్తించేందుకు వచ్చి చూడాలని పోలీసులు చెబుతారు. ఈ సమాచారం విన్న సూరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం జరిగిందని కార్తీక్ ప్రశ్నించడంతో సూరజ్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారాన్ని వివరిస్తాడు. దీంతో కార్తీక్, దీపలు కన్నీటిపర్యంతమవుతారు. సూరజ్ వెంటనే మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలిస్తాడు. అయితే, అక్కడ ఉన్న మృతదేహం జ్యోత్స్నది కాదని తెలుస్తుంది. దీంతో అతడు బయటకు వచ్చి కూర్చుంటాడు.అప్పుడే తన ముందు జ్యోత్స్న కనిపించడంతో సూరజ్ ఆశ్చర్యపోతాడు. ఆమెను చూసిన వెంటనే జ్యోత్స్న అంటూ పిలుస్తూ వెతుకుతాడు. కానీ ఆమె అక్కడి నుంచి మాయమవుతుంది. దీంతో సూరజ్ అయోమయానికి గురవుతాడు.
మృతదేహం జ్యోత్స్నది కాదని సూరజ్ కార్తీక్‌కు మెసేజ్ పంపడంతో కార్తీక్, దీప కొంత ఊరట పొందుతారు. జ్యోత్స్న ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటుందని దీప అంటుండగా, ఆ మాటలు సుమిత్ర వింటుంది. వెంటనే తన కూతురికి ఏమైందని ప్రశ్నిస్తుంది.దీనికి కార్తీక్ సమాధానమిస్తూ, ప్రమాదంలో ఓ యువతి చనిపోవడంతో ఆమెను గుర్తించడానికి సూరజ్ వెళ్లాడని, అయితే ఆ మృతదేహం జ్యోత్స్నది కాదని మెసేజ్ పంపాడని చెబుతాడు. అయినప్పటికీ సుమిత్ర ఆందోళన తగ్గదు. తన బిడ్డ ఎక్కడుందో తెలియనప్పుడు ఆమె క్షేమంగా ఉందని ఎలా చెప్పగలమని ప్రశ్నిస్తుంది. తనపై కోపంతో మాలిని తన కూతురికి ఏదైనా హాని చేసిందేమోనని అనుమానిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.మాలిని నిజంగానే జ్యోత్స్నకు ఏదైనా చేసిందా? లేక సూరజ్ మరోసారి తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడా? అని కార్తీక్ మనసులో సందేహాలు మొదలవుతాయి.
జ్యోత్స్న కనిపించకుండా పోయిన మూడు రోజులు.. సూరజ్ నిలదీత
మరోవైపు, ఇంటి గుమ్మం దగ్గర దక్షిణామూర్తి ఉండటాన్ని, కారులో సూరజ్ పడుకుని ఉండటాన్ని కార్తీక్, దీప గమనిస్తారు. ఇంతలో సూరజ్‌కు మరో ఫోన్ రావడంతో హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.సూరజ్ గత రాత్రి కూడా ఇలాగే కంగారుగా వెళ్లిపోయాడని దీప గుర్తుచేసుకుంటుంది. ఎవరూ ప్రశ్నించకపోతే చెప్పకుండా వెళ్లిపోయేవాడని, ఇప్పుడు కూడా ఏదైనా కొత్త సమస్య వచ్చిందేమోనని ఆందోళన చెందుతుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉందని కార్తీక్ కూడా అంటాడు.అయితే, సూరజ్ ఆఫీసుకు వెళ్లేసరికి జ్యోత్స్న అక్కడే పని చేసుకుంటూ కనిపిస్తుంది. ఆమెను పక్కకు తీసుకెళ్లిన సూరజ్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావని, ఫోన్‌కు ఏమైందని నిలదీస్తాడు. జ్యోత్స్న కనిపించకుండా పోయి నాలుగో రోజు వచ్చిందని, ఈ మూడు రోజుల పాటు ఎక్కడ ఉన్నావో చెప్పాలని ప్రశ్నిస్తాడు.
జ్యోత్స్న కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని సూరజ్ చెబుతాడు. ఆమె ఎక్కడికి వెళ్తోందో ఎవరికీ చెప్పలేదని, ఫోన్ పనిచేయకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో తమ కుటుంబంపై అనుమానాలు పెరిగాయని వివరిస్తాడు. చివరకు సుమిత్ర పోలీసులను తీసుకొచ్చి తన తల్లిని అరెస్ట్ చేయిస్తానని బెదిరించినా తాను భయపడలేదని అంటాడు.నువ్వు చేసిన పనికి తాను, తన తాత తమ ఇంటికి కాపలా కాయాల్సిన పరిస్థితి వచ్చిందని సూరజ్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. జ్యోత్స్నను ఏం చేశారని తన తల్లిని ప్రశ్నించాల్సిందని అంటాడు. కానీ, అసలు జ్యోత్స్న మూడు రోజుల పాటు ఎక్కడికి వెళ్లిందో, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాడు.
జ్యోత్స్న కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులంతా తమ ఇంటికి వచ్చారని, తమ నిజాయితీని నిరూపించుకోవడానికి వేరే మార్గం లేక తాను, తన తాత ఇంటి గుమ్మం దగ్గరే కూర్చోవాల్సి వచ్చిందని సూరజ్ వివరిస్తాడు.రాత్రంతా జ్యోత్స్న కోసం పిచ్చివాడిలా వెతికానని, ప్రమాదంలో ఓ యువతి చనిపోయిందని తెలిసి అది జ్యోత్స్నేమోనని మార్చురీకి వెళ్లానని చెబుతాడు. అక్కడి మృతదేహం ఆమెది కాదని తేలిందని వివరిస్తూ, ఎక్కడికి వెళ్లినా తనకు అభ్యంతరం లేదని, కానీ ఈ మూడు రోజులు ఏం జరిగిందో మాత్రం చెప్పాలని సీరియస్‌గా అడుగుతాడు. ఎక్కడికి వెళ్లావు? ఏమైపోయావు? నిన్ను ఎవరు కనిపించకుండా చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. చేయని తప్పుకు తన కుటుంబం నిందలు ఎదుర్కొందని, ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందేనని సూరజ్ పట్టుబడతాడు. అయితే, జ్యోత్స్న మాత్రం తాను ఏమీ చెప్పనని తేల్చి చెబుతుంది. దీంతో కోపం పట్టలేక సూరజ్ ఆమెపై చేయి చేసుకోబోతాడు.
సూరజ్‌ను అడ్డుకున్న మాలిని.. తల్లీకొడుకుల మధ్య చిచ్చుపై వ్యాఖ్యలు
సూరజ్ జ్యోత్స్నను కొట్టబోతుండగా మాలిని అక్కడికి వచ్చి అతడిని అడ్డుకుంటుంది. పనివాళ్లపై యజమానులు చేయి చేసుకోకూడదని చెబుతూ, కుటుంబాల మధ్యే కాకుండా తల్లీకొడుకుల మధ్య కూడా కొందరు చిచ్చు పెడతారని వ్యాఖ్యానిస్తుంది. అనుమానం అనే అగ్గిని రాజేసి, నిజాయితీని, నమ్మకాన్ని దహనం చేస్తారని మాలిని అంటుంది. చివరకు తల్లిని కొడుకుకు శత్రువుగా మార్చే పరిస్థితులు సృష్టిస్తారని చెబుతుంది. అయితే, అలాంటి సమయంలో కొడుకు తన తల్లి మనసును అర్థం చేసుకోవాలని సూచిస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న తిరిగి వచ్చిందనే విషయం సుమిత్రకు తెలియజేయాలని మాలిని భావిస్తుంది. దీంతో కార్తీక్‌కు వీడియో కాల్ చేస్తుంది. వీడియోలో కూతురిని చూసిన సుమిత్ర సంతోషంతో ఊపిరి పీల్చుకుంటుంది. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని కుటుంబ సభ్యులు అడగ్గా, తాను ఆఫీసులోనే ఉన్నానని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది.అనంతరం ఫోన్‌ను దక్షిణామూర్తి తాతకు ఇవ్వాలని కోరుతుంది. ఆయన చేసిన నిరాహార దీక్ష ఇక చాలనీ, ఇంటికి తిరిగి వెళ్లాలని జ్యోత్స్న చెబుతుంది. తాను కనిపించడమే అన్ని ప్రశ్నలకు సమాధానమని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా చూసిన సూరజ్‌తో, ఇలా చేయడం సరిపోతుందా అన్నట్లుగా జ్యోత్స్న మాట్లాడుతుంది.
దక్షిణామూర్తి, శివన్నారాయణ మధ్య మాటల యుద్ధం
మరోవైపు, దక్షిణామూర్తి తాత ఇంటి గుమ్మం దగ్గర ఉండటంతో కార్తీక్, దీప ఆయనకు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వాలని అనుకుంటారు. అయితే, దక్షిణామూర్తికి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అసహనం వ్యక్తం చేస్తాడు. తాను అక్కడికి వచ్చింది తన మనవరాలి కోసమేనని దక్షిణామూర్తి స్పష్టం చేస్తాడు. దీనికి శివన్నారాయణ ఘాటుగా స్పందిస్తాడు. నీ తాత ఎవరు అని జ్యోత్స్నను అడిగితే, ఆమె తన పేరే చెబుతుందని, దక్షిణామూర్తి పేరు చెప్పదని అంటాడు. దీనిపై దక్షిణామూర్తి తీవ్రంగా బాధపడతాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా మనుషులను ఇబ్బంది పెట్టడం, నిజాలు తెలుసుకోకుండానే నిందలు వేయడం శివన్నారాయణకు బాగా తెలుసని విమర్శిస్తాడు. మాటలు పడింది తానేనని, మర్యాద పోగొట్టుకున్నది కూడా తానేనని ఆవేదన వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా, తమ ఇంటికి పోలీసులను తీసుకొచ్చి అవమానించారని గుర్తుచేస్తాడు.
ఇక తమ వల్ల కాదని, తమను వదిలేయాలని సుమిత్ర కూడా దక్షిణామూర్తిని కోరుతుంది. దేవుడి దయ వల్ల తన కూతురు బాగానే ఉందని, ఇకపై ఈ ఇంటి వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది.కానీ దక్షిణామూర్తి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. తన మనవరాలు జ్యోత్స్న ఈ ఇంట్లో అడుగుపెట్టే వరకు అక్కడి నుంచి వెళ్లనని స్పష్టం చేస్తాడు. జ్యోత్స్న తిరిగి వచ్చిన తర్వాతే ఆమెను సుమిత్రకు అప్పగించి వెళ్తానని సూరజ్‌కు ఫోన్ చేసి చెబుతాడు.
Also Read : Ranabaali Movie Review : రణబాలి మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
జ్యోత్స్న వెనుక మాలిని హస్తం ఉందా? చివర్లో ట్విస్ట్
ఇదిలా ఉండగా, మరోవైపు మాలిని తన ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఆమెను చూసిన మాలిని ఆశ్చర్యపోతుంది.తన ఒంటిపై ఒక్క గీత కూడా పడకుండా, ఇంత సురక్షితంగా తనను వదిలేశావంటూ జ్యోత్స్న మాలినిని ప్రశ్నిస్తుంది. దీంతో మాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది.జ్యోత్స్న మూడు రోజుల పాటు ఎక్కడ ఉంది? ఆమె కనిపించకుండా పోవడం వెనుక మాలిని పాత్ర ఎంతవరకు ఉంది? జ్యోత్స్నకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మాలిని ఎందుకు వదిలేసింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ఈ ఆసక్తికరమైన పరిణామంతో అక్టోబర్ 16 నాటి కార్తీకదీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.







