Home » Andhra Pradesh » Big Breaking The Time For Nara Lokesh Coronation Has Been Fixed
andhra pradesh

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: February 14, 2026 5:35 pm
Advertisement

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, తెర వెనుక అంతా లోకేష్‌ ఆధ్వర్యంలోనే నడుస్తోందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని అఫీషియల్ చేయడానికి ముహూర్తం కూడా ఖరారైపోయిందని గట్టిగా వినిపిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలోనే లోకేష్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం ఖాయమని, దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఒక్క శాతం కూడా అనుమానం లేకుండా, కచ్చితంగా ఇది జరగబోతోందని సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు జనసేన నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ దీనికి పెద్దగా అభ్యంతరాలు ఉన్నట్లు కనిపించడం లేదు, ఎందుకంటే టీడీపీ తదుపరి వారసత్వ నాయకుడు ఆయనే అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

Advertisement

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : లైన్ క్లియర్ కి ఎప్పటినుంచో ప్లాన్ :

చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుండే లోకేష్‌ కోసం లైన్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. అందుకే సీనియర్లను కూడా పక్కన పెట్టి, లోకేష్‌కు అనుకూలంగా ఉండే వాళ్లకే మంత్రివర్గంలో చోటు కల్పించారు. పార్టీలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా వారిని మెల్లగా చల్లబరుస్తూ వస్తున్నారు. ఇక లోకేష్‌ కూడా తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. కేవలం పాలన మీద దృష్టి పెట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో నాయకులతో ఒక ఎమోషనల్ బాండ్ పెంచుకోవాలని ప్లాన్ చేశారు. అందుకే నియోజకవర్గాల వారీగా నాయకుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మచిలీపట్నం నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. నాయకులతో నేరుగా కలిసి భోజనం చేస్తూ, వాళ్ల కుటుంబాలకు దగ్గరవుతూ తనకంటూ ఒక బలమైన క్యాడర్‌ను సెట్ చేసుకుంటున్నారు.

Advertisement

రాజకీయాల్లో నాయకులతో ఎంత సన్నిహితంగా ఉన్నా, రేపు ప్రజలతో కూడా అదే స్థాయిలో బాండింగ్ కుదురుతుందా అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అంతా సెట్ అయిపోయింది కాబట్టి, ఇక కేవలం ఆ మంచి ముహూర్తం కోసం మాత్రమే వెయిటింగ్ అని తెలుస్తోంది. ఏ క్షణమైనా లోకేష్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమని, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చాలా వేగంగా జరిగిపోతోందని ఈ పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రజల మద్దతు ఎలా ఉన్నా, పార్టీలో మరియు కూటమిలో మాత్రం లోకేష్ నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే కనిపిస్తోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి