Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్షించనుండగా, సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవి… తెలంగాణ, కర్ణాటక సహా 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో సాగుతున్న మద్యం విక్రయాలు, పూర్తిగా ప్రైవేట్ హస్తం, ప్రభుత్వ-ప్రైవేటు సమ్మేళన విధానాలు వంటి అన్ని రకాల విధానాలపై సబ్ కమిటీ అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. వివిధ రాష్ట్రాల మద్యం విధానాలను మంత్రులు సీఎంకు వివరించారు.
ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే చాలా తక్కువగా మద్యం పాలసీ ఉంటుందని చెబుతున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, దరఖాస్తు రుసుములు, తిరిగి చెల్లించని ఛార్జీలు, లైసెన్స్ ఫీజులు ఎంత ఉండాలి? ఇతర అంశాలపై ప్రతిపాదనలపై మంత్రుల బృందం ఇప్పటికే అధ్యయనం చేసింది. వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని మంత్రుల బృందం నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత… అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకురానున్నారు. గత ప్రభుత్వ హయాంలో జె బ్రాండ్ మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల పేరుతో విక్రయించి సొమ్ము చేసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందిస్తామన్నారు.
నకిలీ మద్యం బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లను నిలిపివేశామన్నారు..రాష్ట్ర చరిత్రలో తొలిసారి కల్లుగీత కార్మికులకు 10 శాతం దుకాణాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.గత ప్రభుత్వంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పాలకుల జేబుల్లోకి వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. నూతన మద్యం విధానం అమలు తర్వాత పాత బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు..రాష్ట్ర చరిత్రలో తొలిసారి కల్లుగీత కార్మికులకు 10 శాతం దుకాణాలు ఇవ్వబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.గత ప్రభుత్వంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పాలకుల జేబుల్లోకి వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.