Ap Womens : మహిళలకి గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి ఏకంగా రూ.1500
Ap Womens : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతుండగా, ఈ భేటిలో పలు అంశాలపై కీలకమైన చర్చలు జరుపుతున్నారు. నూతన మద్యం విధానం, వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరిగింది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిథి పథకం గురించి కూడా కేబినేట్‌లో చర్చ నడుస్తుంది.
18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైనా చర్చ జరుగనుంది. గతంలో ఈ మొత్తం 3 లక్షలు గా మాత్రమే ఉండేది. అలాగే పేదరికం లేని సమాజం నిర్మించాడంలో భాగంగా పీ 4 పైనా ఈరోజు కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.అలాగే పెండింగులో ఉన్న నీరు – చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై మంత్రి వర్గం చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ. 300 కోట్లు విడుదలపై చర్చ జరుగనుంది.
Ap Womens : మహిళలకి గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి ఏకంగా రూ.1500
బుడమేరు ముంపు, వరద సాయంపై మంత్రివర్గం చర్చించనుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై కెబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైనా కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.ప్రాథమికంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి.. 18 ఏళ్లు వయసు దాటి ఉండాలని.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి నిధులు జమ చేస్తారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా.. ప్రతి నెలా లబ్ధిదారులకు రూ.1500 చొప్పున డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాకు డబ్బుల్ని జమ చేస్తారు. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై కూడా కేబినెట్ చర్చించింది.
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
This website uses cookies.