Botsa Satyanarayana : బొత్స సత్యనారాయణ ఎందుకు భయపడుతున్నారు..!
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసనమండలి సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు ఈసారి సమావేశాలు పెద్ద సవాల్‌గా మారనున్నాయి. ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తూ ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించాల్సిన బాధ్యతను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయనపై ఉంచినట్లు తెలుస్తోంది. ప్రతి సమావేశంలోనూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని జగన్ నుంచి బొత్సకు సూచనలు అందుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించాలని ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బాధ్యతలు బొత్స సత్యనారాయణకు క్రమంగా తలనొప్పిగా మారుతున్నాయనే చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.ప్రభుత్వ నిర్ణయాలను, వైఫల్యాలను సభలో ప్రశ్నిస్తున్నప్పటికీ.. తాను ఆశించిన స్థాయిలో పార్టీకి రాజకీయ మైలేజ్ రావడం లేదనే అసంతృప్తి బొత్సలో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద తరచూ ప్రస్తావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Botsa Satyanarayana : బొత్స సత్యనారాయణ ఎందుకు భయపడుతున్నారు..!
Botsa Satyanarayana : మండలిలో వైసీపీ బలం.. బొత్సపైనే కీలక బాధ్యత
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైసీపీకి ప్రస్తుతం బలం తక్కువగా ఉండటంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కోవడం ఆ పార్టీకి కష్టంగా మారింది. అయితే శాసనమండలిలో మాత్రం వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో మండలిని ప్రధాన రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని మండలిలో ఇరుకున పెట్టే బాధ్యతను జగన్.. బొత్స సత్యనారాయణ భుజాలపై ఉంచుతున్నారు. ఈసారి కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సమావేశాలకు మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించడం, వివిధ అంశాలపై నిరసన వ్యక్తం చేయడం వంటి అంశాల్లో బొత్స కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.అయితే మండలిలో మంత్రులు కూడా ప్రతిపక్ష ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు ఇస్తుండటంతో పాటు.. వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు రావడం తరచూ కనిపిస్తోందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సభ నుంచి బయటకు వెళ్లడం కంటే సభలోనే ఉండి నిరసనలు తెలియజేయడం, ఆందోళనలు చేపట్టడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి మార్గాలను అనుసరించాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
Botsa Satyanarayana ముందుగానే అజెండా ఫిక్స్.. బొత్సకు కీలక అంశాలపై పోరాటం
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావడం లేదు. కేవలం శాసనమండలి సభ్యులు మాత్రమే సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఇందుకోసం బొత్స సత్యనారాయణకు పార్టీ అధినేత జగన్ ముందుగానే కొన్ని ప్రధాన అంశాలను అప్పగించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, అందులోనూ స్పోర్ట్స్ కోటాలో మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం అంశాన్ని బలంగా లేవనెత్తాలని బొత్సకు సూచించినట్లు సమాచారం. డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.అదే సమయంలో విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత కూడా బొత్సకు అప్పగించినట్లు సమాచారం.రైతుల సమస్యలను కూడా మండలిలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రైతులకు సంబంధించిన సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేయనున్నారు.
అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు అంశాన్ని కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని బొత్సకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.ఈ అంశాలన్నింటినీ మండలిలో సమర్థంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ప్రధాన సవాల్‌గా మారింది. పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతలను ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.మరోవైపు, మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమావేశాలు తనకు పెద్ద ఒత్తిడిగా మారుతున్నాయని బొత్స సత్యనారాయణ తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ పదవి కారణంగా టెన్షన్‌కు గురవుతున్నారని, తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నట్లు కథనం పేర్కొంటోంది.మొత్తంగా చూస్తే.. ఈసారి శాసనమండలి సమావేశాలు వైసీపీకి కీలకంగా మారనున్నాయి. సభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించి రాజకీయంగా మైలేజ్ సాధించాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఈ బిగ్ టాస్క్‌ను ఎలా ఎదుర్కొంటారు? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది
