By Reddy Siddhartha Reddy satirical On Pawan Kalyan
By Reddy Siddhartha Reddy : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వైసీపీ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పేరిట పొలిటికల్ టూర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాలో సాగుతున్న ఈ యాత్రలో వైసీపీ పార్టీపై అదేవిధంగా సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రానివ్వకుండా ఉండటమే తన లక్ష్యమని పెద్దపెద్ద డైలాగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా కౌంటర్లు వేశారు. దీనిలో భాగంగా ముద్రగడ పద్మనాభం రాసిన లెటర్ పై జనసేన నేతలు చేస్తున్న విమర్శలను బైరెడ్డి తిప్పికొట్టారు.
ప్రశ్నించిన ముద్రగడని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన వాళ్ళు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రుడు, దొంగ.. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి అని పవన్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ మంచోడిని అని నేను అన్నాను అనుకో వాళ్ళ అభిమానులంతా నన్ను మంచోడని పొగుడుతారు. అదే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే వాళ్ళ అభిమానులంతా నన్ను విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడాలి. చంద్రబాబును వ్యతిరేకిస్తే నువ్వు పూర్తిగా వ్యతిరేకించు. అంతేగాని 2009 ఎన్నికల్లో చంద్రబాబును విమర్శించి, మళ్లీ 2014 ఎన్నికల్లో పొగిడి… మళ్ళీ 2019 ఎన్నికల్లో విమర్శించి ఇప్పుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి తొత్తుగా వ్యవహరిస్తుంటే మధ్యలో ప్రజలు ఏమైనా తిక్కోలా అంటూ పవన్ ని బైరెడ్డి నిలదీశారు.
By Reddy Siddhartha Reddy satirical On Pawan Kalyan
ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు క్లారిటీగా మాట్లాడాలని అన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలుస్తామని బైరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మొదటి విడత మేనిఫెస్టో పై కూడా స్పందించారు. వైసీపీ ఇస్తున్న పథకాల పేర్లు మార్చి..టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే అవటానికి పవన్ కళ్యాణ్ తెగ పాకులాడుతున్నారు అంటూ వారాహి విజయ యాత్రపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అర్ధంలేనివి అనీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఖండించారు.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.