Home » Entertainment » Suma Kanakala Instagram Video Viral
Entertainment

Suma kanakala : యాంకర్ సుమ ఊరెళ్లి ఇంటికి రాగానే రాజీవ్ కనకాల ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్

Authored By
aruna
The Telugu News | Updated on: June 27, 2023, 7:54 pm
Advertisement

Suma kanakala : రెండు తెలుగు రాష్ట్రాలకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరుకు మలయాళీ అమ్మాయి అయినా సుమ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన మాటలతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై మోస్ట్ పాపులర్ యాంకర్ ఎవరైనా ఉంటే అన్నారంటే అది సుమనే. టాప్ యాంకర్ గా బుల్లితెరను ఏలేస్తున్న సుమ పలు సినిమా ఈవెంట్లకు రిలీజ్ ఫంక్షన్లకు హోస్ట్ గా వ్యవహరిస్తుంటుంది. అంత బిజీగా ఉండే సుమా కనకాల సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా సుమ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

వివిధ టీవీ షోల మీద కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. సుమ టీవీ తెరమీద కనిపించినంత మాత్రాన ఆమెకేం అతీంద్రియ శక్తులు ఉండవు ఆమె కూడా సాధారణ మహిళనే. ఆమెకు అందరి మహిళ లాగానే ఉండాలని ఉంటుంది. భర్తతో కలిసి కాఫీ తాగాలని, పిల్లలతో కలిసి ముచ్చట్లు చెప్పాలని, అందరూ కలిసి సినిమా చూడాలని ఉంటుంది. అలాంటి కోరిక నెరవేర్చుకునేందుకు చాలా రోజుల తర్వాత సుమ ఇంటికి వచ్చింది. డ్రైవర్ ఇంటి ముందు కారు ఆపాడో లేదో వెంటనే సుమా లగేజ్ తో సహా కిందికి దిగింది. ఇంట్లో రాజీవ్ ఏదో రాసుకుంటూ ఉన్నాడు. ఇంతలో కాలింగ్ శబ్దం వినబడడం తో పేపర్లు గాలిలోకి ఎగరేశాడు. ఎవరా అని ఆత్రుతగా తలుపు తీశాడు.

Suma kanakala Instagram video viral

Advertisement

సుమా కనిపించడంతో రాజీవ్ మొహం మారిపోయింది. అప్పుడే వచ్చావా 20 లేదా25 రోజులు ఉండలేకపోయావా అంటూ ప్రశ్నించాడు. దీంతో సుమ ముఖంలో నిర్వేదం కనిపించింది. వచ్చేసాను అంటూ సుమ లగేజ్ తో ఇంట్లోకి వెళ్ళింది. సరే లోపలికి రా అంటూ రాజీవ్ ఆమెని ఆహ్వానించాడు. ఇది మొత్తం చదివిన తర్వాత ఈ వీడియో సీరియస్ అనుకుంటే తప్పుగా ఆలోచించినట్లే. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేందుకు రూపొందించారు. చాలా రోజులు ఇంటికి దూరమైన బాధలో ఉన్నట్టు సుమా నటించగా మరెవరి కోసమో ఎదురుచూస్తున్నట్లు రాజీవ్ ని చూపించారు. మొత్తానికి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి