chandrababu satires on YS jagan
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా బహిరంగ సభలలో నా బీసీలు, నా ఎస్సీ లు, నా మైనారిటీలు అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం తెలిసిందే. అయితే జగన్ ఈ రకంగా చేసే ప్రసంగంపై గుత్తిలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏ బీసీకి అయినా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. ఒక్క రూపాయి అయినా ఏమైనా ఇచ్చారా అని నిలదీశారు. బీసీ వర్గాలను జగన్ ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడా అని ప్రశ్నించారు.
అలాంటప్పుడు ఎందుకయ్యా నా బీసీలు అంటూ నాటకాలు ఆడుతావు అని జగన్ మీద చంద్రబాబు మండిపడ్డారు. అంతకుముందు తలనిమిరాడు… ఒక ఛాన్స్ అన్నాడు ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు. ఈ ఛాన్స్ ఇక ఆఖరి ఛాన్స్ కావాలి అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోసారి జగన్ కి ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందని ప్రశ్నించారు. మీ కష్టాలు ఏమైనా తీరాయా అని ప్రజలను అడిగారు.
chandrababu satires on YS jagan
ఎవరైనా జగన్ అధికారంలోకి వచ్చాక నాకు ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గాయి అంటే… ప్రభుత్వం బాగా చేసింది అంటే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా కావాలంటే.. అంటూ ప్రజలకు సవాల్ విసిరారు. జగన్ అధికారంలోకి వచ్చాక భయంకరంగా రేట్లు పెరిగిపోయాయని.. చంద్రబాబు మండిపడ్డారు.
M Parameshwar Reddy : ప్రజాప్రభుత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం , గృహజ్యోతి 200 యూనిట్లు…
pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా జమ్ము కశ్మీర్లోని…
Zipline Operator : పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి కేసులో జిప్లైన్ ఆపరేటర్పై ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు…
iPhone 15 Plus : కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది స్వర్ణావకాశం. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు భారీ…
No Discount : టర్కీలోని turkey ఓ దుకాణం వద్ద ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. దుకాణ యజమాని భారతదేశం, పాకిస్తాన్,…
Mushrooms : పుట్టగొడుగులు కొందరు చాలా ఇష్టంగా తింటారు. ఇవి నిజానికి ఆరోగ్యానికి మంచివే. కానీ, వీటిని ఈ విధంగా…
mother And Son : జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఒక తల్లి ఆవేదన అందర్నీ కన్నీరు పెట్టించింది. "నా…
Thyroid : మహిళలకు పెద్ద సమస్యగా మారింది థైరాయిడ్ సమస్య. మహిళలు చాలామంది ఈ థైరాయిడ్ బారిన పడుతున్నారు. థైరాయిడ్…
This website uses cookies.