
Chandrababu Naidu : బాబు రిటైర్‌మెంట్ అప్పుడేనా? వారసత్వంపై జోరుగా చర్చలు
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో andhra pradesh చంద్రబాబు రాజకీయ వారసత్వం గురించి జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు వయస్సు ఏడున్నర పదులు. బాబు ఎంతో హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారు. కాగా వయస్సు రీత్యా ఆయన రిటైర్‌మెంట్ గురించి చర్చించుకుంటారే తప్పా, ఆయన క్రమశిక్షణ ఆయన దూకుడు, పనిచేసే విధానం ఇవన్నీ చూసిన వారు రిటైర్‌మెంట్ అనే పదం ఇపుడప్పుడే బాబు దరిచేరదని అనుకుంటారు.చంద్రబాబు మరో టర్మ్ కూడా ఇదే ఊపులో సీఎం గా పని చేయగలరని అంతా ఒప్పుకుంటారు. ఒక ఏపీలో 2014లో అయినా 2024లో అయినా బాబుని చూసే ప్రజలు ఓటు వేశారు అన్నది నిర్వివాదమైన అంశం. చంద్రబాబు Chandrababu Naidu విజనరీనూ ఆ రాష్ట్ర ప్రజలకు అంత నమ్మకం. ఆయన మాత్రమే కేంద్రం మెడలు వంచి ఏపీని గట్టెక్కించగలరని నమ్ముతారు.
Chandrababu Naidu : బాబు రిటైర్‌మెంట్ అప్పుడేనా? వారసత్వంపై జోరుగా చర్చలు
చంద్రబాబు సైతం ఏపీ అభివృద్ధి విజనరీని ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటారు. ఆయన ఏపీకి బ్రహ్మాండమైన రాజధానిగా అమరావతిని నిలపాలని చూస్తున్నారు. ఆ విషయంలో ఆయన పట్టుబట్టి ఉన్నారు. అందువల్ల చంద్రబాబు అమరావతి రాజధాని ఒక షేప్ కి వచ్చేంతవరకూ సీఎం గా కచ్చితంగా కొనసాగుతారు అని అంటున్నారు.
భారతదేశంలో పట్టణాభివృద్ధికి అమరావతి భవిష్యత్ ప్రమాణమని, రూ. 50,000 కోట్ల పెట్టుబడితో రాజధాని నగరాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. గుంటూరుకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి NDA ప్రభుత్వం రాజధాని నగరం చుట్టూ 183 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే తన దార్శనికతను హైలైట్ చేస్తూ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు మరియు తిరుపతి వంటి నగరాలను కూడా అమరావతిలోనే కాకుండా ప్రపంచ వేదికపై పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అలాగే 1940 నాటి కల అయిన పోలవరాన్ని తానే పూర్తి చేసి ఆంధ్ర జాతికి అంకితం చేయాలన్న పట్టుదల కూడా బాబుకు ఉంది. అందువల్ల ఆ ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన వేగం ఇటీవల కేంద్రం నుంచి వస్తున్న నిధుల కేటాయింపే నిదర్శనం. ఏపీని దేశంలో కీలకమైన రాష్ట్రంగా ఉంచాలని తపిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు ఇప్పటప్పట్లో అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే చాన్సే లేదని అంటున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.