Chandra Babu : కక్ష్య సాధింపులకు నేను వ్యతిరేకం..!
ప్రధానాంశాలు:
Chandra Babu :కక్ష్య సాధింపులకు నేను వ్యతిరేకం.. జగన్‌ని అరెస్ట్ చేయాలనుకుంటే క్షణాలలో చేసేవాడిని..!
Chandra Babu : వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు Chandra babu కి ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కక్ష్య సాధింపు చర్యలకి దిగుతాడని అందరు భావించారు. కాని ఆయన స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతున్నారు. తాజాగా చంద్రబాబు మంగళగిరి Mangalagiri లో పలు విషయాలపై విలేకర్లతో పిచ్చాపటిగా మాట్లాడారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, విపక్షం తీరు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు వంటి విషయాలపై చాలా స్ట్రైట్‌గా మాట్లాడారు. వైసీపీ YCP హయాంలో కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపణలు రావడం తనకు బంగారు లడ్డూలాంటి అవకాశమని సీఎం చెప్పారు.
Chandra Babu : వారి మాదిరిగా కాదు..
మరి ఇప్పుడు సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా అని రిపోర్టర్స్ అడగగా, దానికి స్పందించిన చంద్రబాబు ఒప్పందం రద్దు చేసుకుంటే జరిమానా కట్టాలి. ఈ దశలో చర్యలు తీసుకోలేం. జగన్ Ys jagan ప్రభుత్వం భూ వివాదాల తేనెతుట్టెను కదిపింది. వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. భూమి సమస్యలను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని తెలిపారు. విశాఖ జిల్లా సింహాచలం Simhachalam పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలియజేశారు.బీసీలకి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కూడా చంద్రబాబు అన్నారు. ఇక గత ప్రభుత్వం ఒక సామాజిక వర్గం వారికే కీలక పోస్టులు కట్టబెట్టిందని , ఒక్క బీసీలనే కాదు సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యమిచ్చేలా ‘సోషల్ ఇంజనీరింగ్’కి తమ ప్రభుత్వం కట్టుబడిందని సీఎం తెలిపారు.
మరోవైపు గీత కార్మికులకు 340 మద్యం షాపులు కేటాయించడం జరిగిందని, ఎస్పీ వర్గీకరణ చేసిందీ కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ నామినేటెడ్ పోస్టుల Nominated Posts కేటాయింపులో సముచిత ప్రాధాన్యమిస్తున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ రేటింగ్ ఇచ్చి పనితీరు ఆధారంగా పదవులు ఇస్తామని చెప్పారు. ఇక సుమారు 2000ల మందిని చంద్రబాబు CBN పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతోపాటు వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. పలువురు దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి దగ్గరికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు. వారి ఇబ్బందుల్ని తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.