Pawan Kalyan : పొత్తులో చేరి నష్టపోయా… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

Advertisement
Advertisement

Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీ బీజేపీ మరియు జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఈ పొత్తుల కోసం మొన్నటి వరకు ఆరాటపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మారుస్తున్నాడు అని చెప్పాలి. మొన్నటి వరకు పోత్తుల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పొత్తుల వలన తాను నష్టపోయానంటూ చెప్పుకొస్తున్నారు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారు అనేది ఎవరు అర్థం చేసుకోవాలని పరిస్థితి. ఎందుకంటే పవన్ కు తోచిన విధంగా తన పార్టీ కార్యకర్తలను మభ్య పెట్టేందుకు కళ్లి బొల్లి కబుర్లు చెబుతూ ఉంటారు.ఇక 2014లో పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎన్ని రంగులు మార్చాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు.అయితే ఇప్పుడు తాజాగా పొత్తు వలన తాను నష్టపోయ అంటూ పవన్ కళ్యాణ్ క్యాడర్ నుంచి సింపతి కొట్టేసే మాటలు మాట్లాడుతున్నారని పలువురు చెబుతున్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా సరే జగన్ ను ఓడించాలనే ఉద్దేశంతో మొదట జనసేన మరియు టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

Advertisement

అనంతరం ఈ కూటమిలోకి బీజేపీ పార్టీని కూడా భాగస్వామిని చేసేందుకు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా కూటమిలో భాగం అయ్యేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా పొత్తు కోసం పాకులాడిన పవన్ కళ్యాణ్ తీరా ఇప్పుడు పొత్తు కుదిరి సీట్ల పంపకం పూర్తయిన తర్వాత తనకు నష్టం జరిగిందంటూ చెప్పుకోస్తున్నారని తన సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ఎందుకంటే జనసేన శ్రేణుల్లో ముందు నుండి కూడా టీడీపీ మరియు బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం అసలు ఇష్టం లేదు అని చెప్పాలి. అయితే రాజకీయాలలో ఏ పార్టీకైనా సరే క్షేత్రస్థాయి క్యాడర్ చాలా ముఖ్యం. అలాంటి క్యాడర్ పొత్తులు లేకుండా సొంతంగా పోటీ చేయాలనే భావిస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోకుండా కార్యకర్తల సూచనలను వినిపించుకోకుండా టీడీపీ తో మరియు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక ఈ పొత్తు పెట్టుకుని మంచి సీట్లు దక్కించుకున్నారంటే అది కూడా కనిపించడం లేదు. మొన్నటి వరకు 24 సీట్లు అని చెప్పుకొచ్చిన ఇప్పుడు మాత్రం కేవలం 21 సీట్లకే జనసేన పరిమితమైంది. దీంతో జనసేన క్యాడర్ చాలామంది అసంతృప్తి చెందారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నీ పార్టీ వద్దు నువ్వు వద్దు అంటూ జనసేన క్యాడర్ తయారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కార్యకర్తలను మభ్య పెట్టేందుకు పవన్ కళ్యాణ్ తెలివిగా తాను పొత్తు లో నష్టపోయారంటూ సింపతి వాడుకుంటున్నారని పలువురు తెలియజేస్తున్నారు.

Advertisement

అయితే టీడీపీ జనసేన పొత్తులో 24 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న జనసేన పార్టీ, బీజేపీ ఎంటర్ అవడంతో 21 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ స్థానాలకు పరిమితమయ్యారు. దీంతో ఎన్నో ఏళ్లుగా జనసేన జెండాను భుజాలపై మోస్తున్న అమాయక కార్యకర్తలకు ,తీవ్ర అన్యాయం జరిగిందని, పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ సమయం డబ్బు వృధా చేసుకునే ఎంతోమంది జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం లేకుండా చేశారు.దీంతో జనసేన నేతలు చాలామంది పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇక వారిని బుజ్జగించేందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టి పొత్తులో తాను నష్టపోయాయంటూ చెబుతున్నారని పలువురు నేతలు తెలియజేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Advertisement

Recent Posts

Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్ప‌ట్లే లేన‌ట్లేనా.. ఈ అగ్ర పోటీదారుల‌కు నిరాశే

Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…

1 hour ago

Telangana : సమగ్ర కుటుంబ సర్వే : వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందా.. లేదా..?

Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్ర‌భుత్వం సమగ్ర కుటుంబ సర్వే…

2 hours ago

Seaplane Trial Run : విజ‌య‌వాడ – శ్రీ‌శైలం సీప్లేన్.. నేడు ట్ర‌య‌ల్ ర‌న్‌ను ప్రారంభించ‌నున్న సీఎం చంద్ర‌బాబు

Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…

3 hours ago

Tollywood Actors : కొడుకుతో పాటు మ‌రి కొంద‌రు స్టార్ హీరోల‌తో మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి

Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చాలా అరుదు. ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో వారు క‌లిసి…

4 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో ఆ గొడ‌వ‌లేంది.. రోజు రోజుకి శృతి మించిపోతున్నారుగా..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెల‌బ్రిటీల మాదిరిగా క‌నిపించడం లేదు.…

5 hours ago

RBI : మీ బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదా.. ఆర్బీఇ కొత్త రూల్స్ తెలుసా.. భారీ ఫైన్ కట్టాల్సిందే..!

RBI  : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు.…

6 hours ago

Coconut Oil : ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తాగితే… ఎంతో శక్తివంతమైన ఐదు ప్రయోజనాలు అందుతాయట తెలుసా…!!

Coconut Oil : కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అని అంటారు. ఎందుకు అంటే ఈ చెట్టు నుండి దొరికే అన్ని…

7 hours ago

Airport Jobs :విజయవాడ, విశాఖపట్న ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు.. AIASL 2024 లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్..!

Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం…

8 hours ago

This website uses cookies.