Relation : ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి అయి అనుకూలమైన భాగస్వామిని పొందినా సరే పక్క చూపులు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక సమాజంలో చోటు చేసుకుంటున్న చాలా నేరాలకు వివాహేతర సంబంధాలే కారణం. పెళ్లయి పిల్లలున్న సరే పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎందరో ఉన్నారు. దీనివల్ల వారి జీవితాలు నాశనం కావడం మాత్రమే కాకుండా చిన్నారుల జీవితాలు కూడా బలవుతున్నాయి. పసివాళ్ళ బాల్యం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో సగానికి పైగా పెళ్లయిన మగాళ్లు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ డేటింగ్ యాప్ గ్లీడెన్ వెల్లడించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
భారతీయులు వివాహేతర సంబంధాలతో చాలా ఆసక్తి ఉండటమే కాక త్వరగా వాటిపట్ల ఆకర్షితులవుతున్నారని సర్వే తెలిపింది. సుమారు 60 శాతం మందికి పైగా మగవాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. నివేదికలో టైర్ 1, టైర్ 2 సిటీలో నివసించే 1503 మంది నుంచి ఈ సమాచారాన్ని సేకరించి యాప్ పరిశోధకులు అంచనా వేశారు. వీరిలో 25 ఏళ్ల నుంచి 50 లోపు వయసు కలిగిన మగవాళ్లను ప్రశ్నించినట్లు తెలుస్తోంది కొన్నేళ్లుగా వివాహ బంధం పై భారతీయులు ఆలోచనలు మారుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న చాలామంది వృత్తి, ఆర్థిక, ఇతర బయట ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు, సరికొత్త అనుభూతులను పొందేందుకు వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది.
ఆధునిక భారతదేశంలో మారుతున్న సంబంధాల గురించి తెలియజేస్తు సర్వేలో పాల్గొన్న వారిలో 46% మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారితో వివాహేతర సంబంధాలను పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 36% మంది మహిళలు 35 శాతం మంది పురుషులు వర్చువల్ విధానంలో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఏది ఏమైనా ఈ వివాహేతర సంబంధా లు మానవ జీవితంలో పెద్దముప్పుగా మారాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను మంచి కంటే చెడుగానే ఎక్కువగా వినియోగిస్తున్నారు దీని వలన కుటుంబాలు నాశనం అవ్వడం తప్ప మరేమీ ఉండదు. మరీ ముఖ్యంగా అభంశుభం తెలియని పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.