Home » Andhra Pradesh » Jr Ntr Support To Janasena Party
andhra pradesh

Jr Ntr : జనసేనకు సపోర్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ .. ఒకే వేదికపై పవర్ స్టార్ – యంగ్ టైగర్..!

Authored By
aruna
The Telugu News | Published on: February 15, 2024, 7:00 pm
Advertisement

Jr Ntr : ఏపీ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి వెళుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి చుక్కలు కనిపించేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఆకట్టుకున్నారు. ఇక మరోవైపు యువగళం పాదయాత్రతో నారా లోకేష్ వైసీపీ పార్టీని ఢీకొట్టేలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేదానిపై టెన్షన్ నెలకొంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ దేవర ‘ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. తన స్పీచ్ తో అందరిని ఉర్రూతలూగించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఎప్పుడు ప్రచారం చేయలేదు.

Advertisement

అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న ఆయన సిద్ధాంతాలు అంటే జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. ‘ అరవింద సమేత ‘ సినిమా ముహూర్తం అప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా జూనియర్ ఎన్టీఆర్ రానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నే స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కలిసి వస్తున్నాయి కాబట్టి మీకు సపోర్టుగా నేను వస్తాను అని జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి చెప్పారట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు అన్నింటినీ పక్కన పెట్టేసి ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జనసేనాని పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ప్రచారానికి వస్తే అభిమానులలో జోష్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మార్పు కాబోతారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ప్రచారానికి వస్తే జనసేన అభిమానులు కార్యకర్తల జోష్ పెరుగుతుంది. తెలుగుదేశం జనసేన కలిసి వెళుతున్నాయి కాబట్టి జనసేన అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను స్వాగతిస్తారు. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఓకే స్టేజి మీద మాట్లాడితే పూనకాలే అని అభిమానులు అంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ప్రచారం చేస్తారా లేక ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి