
Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు. అందులో నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలైతే స్పెషల్ గా అది కనిపిస్తుంది. ఐతే ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కేవలం సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నాడు. అంతకుముందు టీడెపీ కోసం ప్రచారం చేశాడు. 2009లో టీడీపీ తరపున ప్రచారంలో చేసిన ఎన్టీఆర్ ఆ టర్మ్ లో ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. మధ్యలో ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందని టాక్ వినిపించిందు. హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ని దూరం పెట్టిందని చెప్పుకున్నారు. .
ఐతే బ్రదర్స్ కళ్యాణ్ రాం, ఎన్టీఆర్ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. 2014లో టీడీపీ వచ్చినా పెద్దగా పట్టనట్టుగానే ఉన్న ఎన్టీఆర్ 2019 లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న టైం లో కూడా సైలెంట్ గా ఉన్నాడు కారణాలు ఏవైనా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. మరోపక్క బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ఉత్సవానికి హాజరు కాలేదు. ఆల్రెడీ నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.
Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి మీద రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. న్యూట్రల్స్ ఎంత ట్రై చేసినా సరే వారి మధ్య సంధి కుదరట్లేదు. ఐతే ఏపీలో భారీ వర్షాల వల్ల విజయవాడ లో భారీ ఆస్తి నష్టం జరిగింది. దీనికి ఎన్టీఆర్ తన వంతుగా ఏపీకి 50 లక్షలు, తెలంగాణాకు 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించాడు. ఈ విరాళం అందించేందుకు ఎన్టీఆర్ కచ్చితంగా ఏపీ సీఎం చంద్రబాబుని కలుస్తాడని చెప్పుకుంటున్నారు. ఐతే నిజంగానే చంద్రబాబు ని ఎన్టీఆర్ కలిస్తే ఫ్యాన్స్ మధ్య ఉన్న ఈ దూరం కూడా తగ్గిపోతుంది
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.