Kiran Rayal : జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు - కిరణ్ రాయల్
Kiran Rayal : వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డినే పెద్ద వెన్నుపోటు దారుడని కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు దినం కాదు గుండెపోటు దినంగా ప్రకటించాలంటూ కిరణ్ రాయల్ సలహా ఇచ్చారు. బాబాయి ఆత్మకు శాంతి కలగాలంటే కచ్చితంగా మార్చి 15ను గుండెపోటు , గొడ్డలిపోటు దినంగా ప్రకటించాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు మెయిల్ చేశాం అని తెలిపారు…
Kiran Rayal : జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు – కిరణ్ రాయల్
కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వివేకా(బాబాయ్)హత్యకి గొడ్డలి పోటు పొడిచి…ఇప్పుడు వెన్నుపోటు దినం, పోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సొంత చెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ సర్వనాశనం అయిందని చెప్పారు. పెన్షన్ రూ. 4 వేలు చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో రూ. 1000 పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ప్రకటించారు. జగన్ హయాంలో అమరావతిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. మూడు రాజధానులని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్, ఉచిత గ్యాస్ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం వెన్నుపోటును, గొడ్డలి పోటును పేటెంట్‌గా తీసుకుందని సెటైర్లు వేశారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.