Kodali Nani : నందమూరి ఎన్టీరామారావు వర్ధంతి రోజున ఆ కుటుంబంలోని విభేదాలు బయటికి వచ్చాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఆ తర్వాత తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలను చూసి తొలగించమని ఆదేశించారు. దీంతో ఇక్కడే అసలు గొడవకు దారి తీసింది.దీంతో ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య పై మండిపడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయంపై స్పందించారు. వెయ్యి మంది బాలకృష్ణ లు, చంద్రబాబులు వచ్చిన ఎన్టీఆర్ ను ఏం చేయలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబుది, బాలకృష్ణది నీచమైన బుద్ధి అంటూ కొడాలి నాని ఫైరయ్యారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అంటూ మండిపడ్డారు. పెద్ద ఎన్టీఆర్ పేరు చెప్పి భజన చేసుకునే వీరు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించే అర్హత లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. సీనియర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పెద్ద గజదొంగ. బ్రతికున్నప్పుడు దుర్మార్గుడు అని చెప్పి, రాజకీయాలకు పనికిరాడు అని చెప్పిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ స్వస్థలానికి వచ్చి నివాళులు అర్పించడం, ఇవన్నీ పదవి కోసమే చేస్తున్నాడు అని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరు చెబితే ఓట్లు వస్తాయని భావించిన చంద్రబాబు ప్రతిసారి ఆయన పేరును తలుస్తున్నారు.
ఎన్టీఆర్ ఉనికి లేకుండా చేయాలని చూసిన చంద్రబాబుకి ఆయన పేరు చెప్పకపోతే ప్రజలు పట్టించుకోరని తెలుసు. అందుకే అధికారం కోసం ఎంత నీచమైన పని చేయడానికి అయినా చంద్రబాబు వెనకాడడు అని చంద్రబాబు నాయుడు పై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేసినా వారి కల నెరవేరదని అన్నారు. గతంలోనూ తనను ఓడిస్తానని చెప్పిన ఏం చేశారని తెలిపారు. గుడివాడ ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. వైసీపీలో టికెట్లు రానివారు ఇతర పార్టీలోకి వెళుతున్నారని పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరూ వెళ్లడం లేదని కొడాలి నాని వెల్లడించారు. ఓడిపోయే వారికి వై.యస్.జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వమని ముందుగానే చెప్పారని తెలిపారు. తనకు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా వైసీపీ అధికారంలోకి రావడానికి మాత్రమే పనిచేస్తానని కొడాలి నాని తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.