kodali Nani : ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అటు ప్రజలలో ఇటు పార్టీ కార్యకర్తలలో భారీ అంచనాల మధ్య ఏర్పడిన కూటమి ప్రభుత్వం అంచనాలను ఏమేరకు నిలబెట్టుకుంది అన్న విషయానికి వస్తే ఐదేళ్లలో జగన్ సర్కార్ చెప్పలేని రాష్ట్ర రాజధాని ఏది అన్న ఒక ప్రశ్నకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నిముషాలలోనే ఎటువంటి ప్రకటన విడుదల చెయ్యకుండానే రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పగలిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో హద్దుదాటి ప్రవర్తించిన ప్రతి అధికారి మీద, నోరు జారీ ప్రవర్తించిన ప్రతి వైసీపీ నాయకుడి మీద చర్యలు తప్పవని ఊదరగొట్టిన బాబు, పవన్ లు అధికారం అందగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయారు.
బయటకు వారు సైలెంట్‌గా కనిపిస్తున్నాడా కూడా లోలోపల వారు పనులని చక్కబెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తుండగా, నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని అంటున్నారు. కొడాలినాని, వంశీలను పేర్ని నాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని కొడాని నాని గుడివాడలో తొలిసారి ఓటమిపాలయ్యారు. గతంలో ఎన్నోమార్లు ఆయనను ఓడించాలన్న టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు గుడివాడలో తిరుగులేదని భావించారు. 2024 ఎన్నికల్లోనూ తనను ఓడంచడం అసాధ్యమని ఆయన గట్టిగా నమ్మారు.. అలాంటిది వెనిగండ్ల రాము చేతిలో ఆయన దారుణంగా ఓటమిపాలయ్యారు. నిజానికి ఆయన ఊహించని ఓటమి. ఇది జీర్ణించుకోవడానికి ఆయన చాలా సమయం పట్టింది
కొడాలి నాని గుడివాడను వదిలేసి హైదరాబాద్ కే ఎక్కువ సమయం పరిమితమయ్యారు. తన ముఖ్య అనుచరులకు మినహా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. తనను లక్ష్యంగా చేసుకుంటారని కొడాలి నానికి తెలియంది కాదు. అందుకే ఆయన ముందు జాగ్రత్తగా గుడివాడకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉంటూ అవసరమైతే తప్ప ఎవరికీ ఫోన్ లు కూడా చేయడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కొడాలి నానిపై వరస కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని పోలీసులు పావులు కదుపుతున్నారు. పాత కేసులు తిరగదోడుతున్నారని తెలిసింది. త్వరలోనే కేసులు నమోదు చేసి కొడాలి నానిని అరెస్ట్ చేస్తారని గుడివాడలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది . కొడాలి నాని గుడివాడ రాకుండా హైదరాబాద్ లో ఉంటూ తనపై నమోదయిన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించే పనిలో ఉన్నారని ఓ టాక్ నడుస్తుంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.